హైదరాబాద్‌లోని ఇంటర్నేషనల్ స్కూల్‌లో శుక్రవారం దారుణ సంఘటన జరిగింది. బంజారాహిల్స్‌లో ఉన్న మెరీడియన్ స్కూల్‌లో ఊహించని ప్రమాదం చోటు చేసుకుంది. స్కూల్‌లో విద్యనభ్యసిస్తున్న విద్యార్థికి విద్యుత్ షాక్ తగిలింది. ప్రహారీకి ఉన్న విద్యుత్ ఫెన్షింగ్ తగలడంతో ప్రమాదం జరిగింది. దీంతో తీవ్ర గాయాలైన విద్యార్థిని వెంటనే ఆసుపత్రికి తరలించారు. విషయం తెలుసుకున్న విద్యార్థులు హుటాహుటిన స్కూల్‌కు చేరుకున్నారు. స్కూల్ యాజమాన్యం నిర్లక్ష్యం వల్లే ఈ ప్రమాదం జరిగిందని పేరెంట్స్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
మాజమాన్యంపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. శుక్రవారం మధ్యాహ్నం లంచ్ టైమ్‌లో ఆడుకుంటుండగా ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. గాయపడిన విద్యార్థి హసన్ పాఠశాలలో 11వ తరగతి చదువుతున్నాడు. హసన్ తల్లిదండ్రులు పాఠశాల యాజమాన్యం నిర్లక్ష్యంపై ఫిర్యాదు చేశారు. తగతి చర్యలు తీసుకోవాలని పోలీసులను కోరారు. ఇదిలా ఉంటే ట్రాన్స్‌ఫార్మర్‌కు సమీపంలో ఐరన్ రాడ్స్ ఉండడం వల్ల ఈ ప్రమాదం జరిగిందని భావిస్తున్నారు. పూర్తి విచారణ జరిగితే తప్ప ప్రమాదానికి గల కారణాలు ఏంటో తెలిసే అవకాశం లేదు.
మరిన్ని హైదరాబాద్ వార్తల కోసం క్లిక్ చేయండి..