హైదరాబాద్‌లో తీవ్ర విషాదం.. ఎనిమిదేళ్ల బాలుడు ఫ్యాన్‌కు ఉరివేసుకుని మృతి!

హైదరాబాద్‌లోని మైలార్‌దేవ్‌పల్లి పోలీస్‌స్టేషన్ పరిధిలోని లక్ష్మీగూడలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. ఎనిమిదేళ్ల బాలుడు రాఘవ ఇంట్లో ఫ్యాన్‌కు ఉరివేసుకుని అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. తండ్రి పనికి, తల్లి కూరగాయల కోసం బయటకు వెళ్లిన సమయంలో ఈ ఘటన జరిగింది. తల్లిదండ్రులు తిరిగి వచ్చేసరికి బాలుడు విగతజీవిగా వేలాడుతూ కనిపించాడు. కేవలం ఎనిమిదేళ్ల వయసున్న బాలుడు ఆత్మహత్య చేసుకున్నాడా లేక ఆటలాడుతూ ప్రమాదవశాత్తూ ఉరి పడిందా అనే కోణంలో పోలీసులు విచారణ జరుపుతున్నారు. పూర్తి వివరాల్లోకి వెళితే..

హైదరాబాద్‌లో తీవ్ర విషాదం.. ఎనిమిదేళ్ల బాలుడు ఫ్యాన్‌కు ఉరివేసుకుని మృతి!
8 Year Old Boy Death

Edited By:

Updated on: Nov 02, 2026 | 8:17 PM

హైదరాబాద్‌లోని మైలార్‌దేవ్‌పల్లి పోలీస్‌స్టేషన్ పరిధిలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. రంగారెడ్డి జిల్లా లక్ష్మీగూడలో ఎనిమిదేళ్ల బాలుడు రాఘవ ఇంట్లో ఫ్యాన్‌కు ఉరివేసుకుని మృతి చెందాడు. తల్లిదండ్రులు ఇంట్లో లేని సమయంలో ఈ ఘటన జరగడం పలు అనుమానాలకు తావిస్తోంది.

వివరాల్లోకి వెళ్తే.. ఉత్తరప్రదేశ్ నుంచి ఉపాధి కోసం హైదరాబాద్‌కు వలస వచ్చిన ఓ కుటుంబం లక్ష్మీగూడలో నివాసం ఉంటోంది. ఉదయం బాలుడి తండ్రి పనికి వెళ్లగా.. తల్లి కూరగాయలు కొనుగోలు చేసేందుకు బయటకు వెళ్లింది. కొద్దిసేపటి తర్వాత ఇంటికి తిరిగి వచ్చిన తల్లిదండ్రులకు కుమారుడు విగతజీవిగా కనిపించాడు. దీంతో ఒక్కసారిగా ఆ కుటుంబంలో విషాదం అలముకుంది.

అసలేం జరిగింది?

కేవలం ఎనిమిదేళ్ల వయసున్న బాలుడు ఇలాంటి నిర్ణయం తీసుకోవడానికి కారణమేంటి? తల్లిదండ్రులు బయటకు వెళ్లిన సమయంలో ఇంట్లో ఏం జరిగింది? బాలుడు ఏదైనా సమస్యతో బాధపడుతున్నాడా? ఇంట్లో జరిగిన ఏదైనా సంఘటన ఈ విషాదానికి కారణమైందా? లేక ఇది ప్రమాదవశాత్తూ జరిగిన ఘటననా? అనే ప్రశ్నలు ఇప్పుడు చర్చకు వస్తున్నాయి. అయితే ఇవన్నీ ప్రస్తుతానికి అనుమానాలు మాత్రమే. బాలుడి మృతికి గల అసలు కారణం పోలీసుల విచారణలోనే తేలాల్సి ఉంది. ఘటనాస్థలాన్ని పరిశీలించి, కుటుంబ సభ్యుల నుంచి వివరాలు సేకరిస్తే మరిన్ని విషయాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది.

ఇవి కూడా చదవండి

కన్నీరుమున్నీరైన తల్లిదండ్రులు

కళ్లముందే పెరిగిన కన్నకొడుకు విగతజీవిగా కనిపించడంతో తల్లిదండ్రులు గుండెలవిసేలా రోదించారు. ముఖ్యంగా తల్లి రోదనలు అక్కడున్న వారిని కంటతడి పెట్టించాయి. రెక్కల కష్టంతో బిడ్డను పెంచుకుంటున్న వలస కుటుంబానికి ఈ ఘటన తీరని శోకాన్ని మిగిల్చింది. ఎనిమిదేళ్ల చిన్నారి మృతితో లక్ష్మీగూడలో విషాదఛాయలు అలముకున్నాయి. బాలుడి మృతికి దారితీసిన పరిస్థితులపై పోలీసులు సమగ్ర విచారణ జరపాల్సి ఉంది. పూర్తి వివరాలు తెలియాల్సి ఉన్నాయి.

మరిన్ని తెలంగాణ న్యూస్ కోసం క్లిక్ చేయండి..

Loading...
Unable to load recommendations.
Follow Us