పూజ చేస్తుండగా చిన్న ఏమరపాటు.. క్షణాల్లో నిండు ప్రాణం బలి! ఏం జరిగిందంటే..

హైదరాబాద్‌లోని బేగంపేటలోని శ్యామ్‌లాల్ ప్రాంతానికి చెందిన విజయలక్ష్మీ ప్రభుత్వ స్కూల్ ప్రిన్సిపాల్‌గా రిటైర్ అయ్యారు. ప్రస్తుతం ఇంట్లోనే ఒంటరిగా ఉంటుంది. రోజు ఉదయాన్నే ఇంట్లో పూజ చేసే అలవాటు ఉన్న విజయలక్షి.. గురువారం తెల్లవారుజామున పూజ చేసేందుకు కూర్చుంది. ఇందులో భాగంగా దీపం వెలిగిస్తుండగా..

పూజ చేస్తుండగా చిన్న ఏమరపాటు.. క్షణాల్లో నిండు ప్రాణం బలి! ఏం జరిగిందంటే..
Retired Government School Principal Died

Updated on: Apr 18, 2026 | 4:16 PM

హైదరాబాద్, ఏప్రిల్ 18: హైదరాబాద్‌లోని బేగంపేట్‌లో దారుణ ఘటన చోటుచేసుకుంది. రోజూ తెల్లవారుజామున పూజ చేసే అలవాటు ఉన్న ఓ రిటైర్డ్ ప్రిన్సిపల్ అనూహత్యంగా మృత్యువాత పడింది. పూజలో భాగంగా దీపం వెలిగిస్తుండగా చీరకు నిప్పంటుకుని మృతి చెందింది. మృతురాలిని విజయలక్ష్మీ (62)గా గుర్తించారు. వివరాల్లోకి వెళ్లే..

హైదరాబాద్‌లోని బేగంపేటలోని శ్యామ్‌లాల్ ప్రాంతానికి చెందిన విజయలక్ష్మీ ప్రభుత్వ స్కూల్ ప్రిన్సిపాల్‌గా రిటైర్ అయ్యారు. ప్రస్తుతం ఇంట్లోనే ఒంటరిగా ఉంటుంది. రోజు ఉదయాన్నే ఇంట్లో పూజ చేసే అలవాటు ఉన్న విజయలక్షి.. గురువారం తెల్లవారుజామున పూజ చేసేందుకు కూర్చుంది. ఇందులో భాగంగా దీపం వెలిగిస్తుండగా ప్రమాదవశాత్తూ ఆమె చీరకు నిప్పంటుకుంది. దీంతో ఆమె భయంతో ఇంట్లో అటు ఇటు పరుగులు తీసింది. పడక గదిలోకి కూడా వెళ్లడంతో దుప్పట్లకు మంటలు అంటుకుని ప్రమాద తీవ్రత మరింత పెరిగింది. అలాగే ఇంట్లో సామాగ్రి సోఫా, కర్టెన్లు, ఇతర ఫర్నీచర్‌కు సైతం మంటలు అంటుకున్నాయి. ఈ ఘటనలో ఒళ్లంతా మంటలు అంటుకోవడంతో తీవ్రంగా గాయపడింది. మరోవైపు ఇంటి నిండా పొగ నిండిపోవడంతో ఊపిరాడక అక్కడికక్కడే మృతి చెందింది.

ఇంట్లో నుంచి పొగలు రావడం గమనించి స్థానికులు వెంటనే పోలీసులు, ఫైర్ సిబ్బందికి సమాచారం అందించారు. అదే ఇంట్లో రెండో అంతస్తులో మృతురాలు విజయలక్ష్మి కుమార్తె నివాసం ఉంటుంది. హుటాహుటిన ఘటనాస్థలికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను ఆర్పివేసి, విజయలక్ష్మిని బయటకు తీసుకువచ్చారు. అయితే అప్పటికే ఆమె మృతిచెందినట్లు గుర్తించారు. ఈ ఘటనపై విజయలక్ష్మి కూతురు ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తు్న్నారు. విజయలక్ష్మీ గవర్నమెంట్ స్కూల్ ప్రిన్సిపల్‌గా పని చేసి రిటైర్ అయింది. ఉద్యోగ విరమణ అనంతరం తన తల్లి విజయలక్ష్మి బేగంపేట్ ష్యామ్‌లాల్ ప్రాంతంలో ఒంటరిగా నివసిస్తుంది. రోజూ పూజ చేస్తుందని కుమార్తె పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో తెలిపింది.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి.

Follow Us