Hyderabad: మద్యం మత్తులో డ్రైవింగ్.. ఇద్దరు దుర్మరణం.. ఏడుగురికి

|

Mar 02, 2022 | 7:54 AM

Road Accident in Medchal Check Post: మద్యం మత్తులో వాహనం నడపటంతో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుంది. ఈ ప్రమాదంలో ఇద్దరు మృతిచెందగా..

Hyderabad: మద్యం మత్తులో డ్రైవింగ్.. ఇద్దరు దుర్మరణం.. ఏడుగురికి
Road Accident
Follow us on

Road Accident in Medchal Check Post: మద్యం మత్తులో వాహనం నడపటంతో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుంది. ఈ ప్రమాదంలో ఇద్దరు మృతిచెందగా..ఏడుగురు తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటన మేడ్చల్‌ చెక్‌పోస్టు వద్ద జాతీయ రహదారిపై మంగళవారం రాత్రి చోటుచేసుకుంది. వేగంగా వస్తున్న కారు డివైడర్‌పైకి దూసుకెళ్లడంతో ఈ ఘటన జరిగినట్లు స్థానికులు వెల్లడించారు. ఈ ఘటన గురించి సమాచారం అందుకున్న పోలీసులు (Hyderabad Police) ఘటనాస్థలికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. ప్రమాద సమయంలో కారులో 9 మంది ఉన్నట్లు పోలీసులు తెలిపారు. క్షతగాత్రులను గాంధీ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.

డ్రైవర్ మద్యం మత్తులో ఉండగా.. కారు అదుపుతప్పి చెక్ పోస్ట్ బావర్చి హోటల్ దగ్గర డివైడర్‌పైకి దూసుకెళ్లింది. అతివేగంగా రామాయంపేట్ నుంచి నగరానికి వెళ్తుండగా ఈ ఘటన జరిగినట్లు పోలీసులు తెలిపారు. మృతుల వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

Also Read:

Hair Fall: మీకు జుట్టు ఊడిపోయి బట్టతల వస్తుందా?.. అసలు కారణం ఇదేనట.. ఇప్పుడే తెలుసుకోండి..

Nagarjuna: మలయాళీ సూపర్ హిట్ రీమేక్‌పై కన్నేసిన నాగ్‌.. మనం తర్వాత అఖిల్‌ మరోసారి.?