NT అవార్డుల్లో టీవీ తెలుగు హవా.. వివిధ విభాగాల్లో 11 అవార్డులు సొంతం..

రెండు దశాబ్దాలు దాటినా అదే పదును.. అదే చదును. సారవంతమైన వార్తకు, మెరుగైన సమాజానికి అంటుకట్టి... వార్తను చూడముచ్చటగా మలచడంలో, దాన్ని జనానికి చేరవేయడంలో మేటి అనిపించుకున్న టీవీ9 తన సాహసోపేతమైన ప్రయాణాన్ని కొనసాగిస్తోంది. ప్రజల గుండెల్ని గెలవడమే కాదు..

NT అవార్డుల్లో టీవీ తెలుగు హవా.. వివిధ విభాగాల్లో 11 అవార్డులు సొంతం..
Rajinikanth Vellalacheruvu

Updated on: Dec 11, 2023 | 1:13 PM

రెండు దశాబ్దాలు దాటినా అదే పదును.. అదే చదును. సారవంతమైన వార్తకు, మెరుగైన సమాజానికి అంటుకట్టి… వార్తను చూడముచ్చటగా మలచడంలో, దాన్ని జనానికి చేరవేయడంలో మేటి అనిపించుకున్న టీవీ9 తన సాహసోపేతమైన ప్రయాణాన్ని కొనసాగిస్తోంది. ప్రజల గుండెల్ని గెలవడమే కాదు.. పురస్కారాల పోటీలో కూడా సత్తా చాటుతూ దూసుకెళ్తోంది. లేటెస్ట్ అచీవ్‌మెంట్ ఏంటంటే… ప్రతిష్టాత్మక NT అవార్డుల్లో జాతీయస్థాయి విజేత.. నన్ అదర్ దేన్‌ టీవీ9 తెలుగు.

మన ఆవకాయ్, మన గోంగూర, మన ఉగాది, మన సంక్రాంతి, మన తిరుమలేశుడు, మన చార్మినార్… మన టీవీ9. ఎస్. ఇది మన టీవీ9.. అని గుండెలకు హత్తుకునే ఉండిపోయాడు తెలుగు ప్రేక్షకుడు. తెలుగు సంప్రదాయాల పరంపరలో ఒకటిగా, తెలుగు రాష్ట్రాల ల్యాండ్‌మార్క్స్‌లో ఒకటిగా, తెలుగు వార్తకు మారుపేరుగా ఇప్పటికీ ఎప్పటికీ నిలిచే ఉంటుంది టీవీ9. సగటు తెలుగు ప్రేక్షకుడి మనసుపై అమరిన ఈ పచ్చబొట్టు.. ఏ కుయుక్తులకు, ఏ బెదిరింపులకు, ఏ మానిప్యులేషన్లకు లొంగనిది చెదరనిది అని మరోసారి రుజువైంది. జనమిచ్చిన రివార్డులకు తోడు తరచూ వచ్చే పురస్కారాలతో పండగలా సాగుతోంది టీవీ9 జర్నీ.

ప్రజల గుండె చప్పుడుగా దేశంలోనే నెంబర్‌ వన్‌ న్యూస్ నెట్‌ వర్క్‌గా అవతరించి, నేషనల్ ఎలక్ట్రానిక్ మీడియాలో తెలుగు ముద్రను శాశ్వతం చేసిన టీవీ9.. తాజాగా మరో అచీవ్‌మెంట్‌ను తన ఖాతాలో వేసుకుంది. ప్రతిష్టాత్మకమైన న్యూస్‌ టెలివిజన్‌ అవార్డుల్లో ఈసారి కూడా టీవీ9 ప్రభంజనం చాటింది. టీవీ9 న్యూస్‌ నెట్‌‌వర్క్‌ మొత్తం 53 అవార్డుల్ని సొంతం చేసుకుంది. అందులో టీవీ9 తెలుగు ఛానల్‌కి ఏకంగా 11 అవార్డులొచ్చాయి. ఢిల్లీ వేదికగా జరిగిన ప్రదానోత్సవంలో టీవీ9 తెలుగుకి గ్రాండ్ అప్లాజ్ లభించింది. కరెంట్ ఎఫైర్స్‌పై టీవీ9 తెలుగు ఎక్స్‌క్లూజివ్‌గా సమర్పిస్తున్న చర్చాకార్యక్రమం… బిగ్‌ న్యూస్‌..బిగ్‌ డిబేట్‌.. ప్రజంటర్ వెల్లలచెరువు రజనీకాంత్‌.. ఎన్‌టీ ఆవార్డుల్లో బిగ్ విన్నర్.

పర్సనాలిటీ కేటగిరీలో టీవీ9 తెలుగుకు 4 అవార్డులొచ్చాయి. ప్రైమ్‌ టైమ్‌ బెస్ట్‌ టీవీ న్యూస్‌ ప్రజెంటర్స్‌గా రజనీకాంత్‌, దీప్తి వాజ్‌పేయి, నేత్ర, యువ జర్నలిస్ట్‌ కేటగిరిలో ప్రణీతకు ఎన్‌టీ అవార్డ్స్‌ దక్కాయి. బెస్ట్‌ ప్రొగ్రామ్‌ డిజైనింగ్‌, ప్యాకేజింగ్‌ కేటగిరీలో వీడియో జర్నలిస్ట్‌ రంగ, గ్రాఫిక్స్‌ క్రియేటివ్‌ హెడ్‌ మనోజ్‌ అవార్డులందుకున్నారు. సామాజిక జీవన వేదాన్ని దృశ్య కావ్యంగా మలిచి తీసిన అరుదైన కార్యక్రమం ‘అనగనగా ఒక ఊరు’.. మరోమారు NT అవార్డుల వేదికపై మెరిసింది. ఆదివాసీల అస్తిత్వ ప్రతీక అంటూ నాగోబా జాతర స్వచ్ఛతను- చరిత్రను తెరకెక్కించినా, నల్లమల అడవుల్లో చెంచుల అరణ్యరోదనకు అద్దం పట్టినా, ఇసుక మాఫియాకు ఖర్చయిపోతున్న మానేరు కోసం కరీంనగర్‌ ప్రజల పోరాట పటిమను ప్రజంట్ చేసినా.. దేనికదే సాటి, దేనికదే పోటీ. టోటల్‌గా పల్లె బతుకు సంపూర్ణ చిత్రం… అనగనగా ఒక ఊరు. విన్నర్ ఈజ్ టీవీ9 ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ భానుకిరణ్.

వినోదం- సినీ విజ్ఞానంలో కొత్త ఒరవడి సృష్టించిన టీవీ9 సైన్మా 2.O… ఎంటర్‌టైన్‌మెంట్ విభాగంలో విజేతగా నిలిచింది. టోటల్‌గా 11 పురస్కారాలతో ఈసారి NT అవార్డ్స్‌లో తెలుగు రాష్ట్రం తరఫున గెలుపు జెండా ఎగరేసింది టీవీ9. అటు.. మిగతా అన్ని భాషాఛానెళ్ల కంటే ఎక్కువ అవార్డులు గెల్చుకుని ప్రైమ్‌టైమ్‌ ప్రజెంటేషన్‌లో కూడా వన్‌అండ్‌ ఓన్లీ అనిపించుకుంది టీవీ9. ట్వంటీఫోర్ అవర్స్ న్యూస్ ఛానల్‌గా ప్రతి తెలుగు లోగిలినీ ఆక్రమించిన టీవీ9.. తెలుగు సమాజంలో ఒక సంప్రదాయంగా మారిపోయింది. వార్తలు చూడాలి టీవీ9 పెట్టండర్రా అనే మాట ప్రతీ తెలుగింటా ఇప్పటికీ వినిపిస్తోందంటే.. అది జనమిచ్చిన రివార్డు. ఆ తర్వాతే అవార్డులైనా ఇంకేమైనా.

(RAJA SREEHARI, TV9 Telugu Desk)