
సరిగ్గా ప్లాన్ చేసుకోకపోతే.. విహార యాత్రలు విషాద యాత్రలుగా మారిపోతాయి. ఈ మధ్య ఇలాంటి ఘటనలు తరచుగా చూస్తున్నాం. అయినా కొందరు లైట్ తీసుకుని ప్రాణాల మీదకి తెచ్చుకుంటున్నారు. తాజాగా తెలంగాణకు చెందిన ఓ లేడీ డాక్టర్.. కర్నాటక హాలీడే ట్రిప్ ఫ్లాన్ చేసుకున్నారు. అక్కడి సనాపూర్ దగ్గరలోని తుంగభద్ర రివర్ వద్దకు వెళ్లారు. అక్కడి వాతావరణం నచ్చడంతో స్విమ్ చేయాలని భావించారు. అయితే నీటిలోకి దిగిన తర్వాత.. వాటర్ ప్లో ఒక్కసారిగా పెరగడంతో ఆమె కొట్టుకుపోయారు. సదరు లేడీ డాక్టర్.. హైదరాబాద్ నాంపల్లికి చెందిన అనన్య మోహన్‌రావుగా గుర్తించారు. ఆమె సిటీలోని వీకేటీ ఆస్పత్రిలో వైద్యురాలిగా సేవలందిస్తున్నట్లు సమాచారం.
అనన్య.. తన ప్రెండ్స్ అషిత, స్వాతిక్‌లతో కలిసి మంగళవారం(ఫిబ్రవరి 18) సాయంత్రం ట్రిప్‌లో భాగంగా కర్ణాటక రాష్ట్రం గంగావతి జిల్లాకు వెళ్లారు. సనాపూర్ దగ్గర్లోని వైట్ సాండ్ అనే విడిది ప్రాంతం చేరుకున్నారు. వారు ముగ్గురు గెస్ట్‌హౌస్ వెనుక ఉన్న తుంగభద్ర నదిలో స్విమ్మింగ్ చేసేందుకు వెళ్లారు. అయితే స్విమ్మింగ్ బాగా వచ్చిన అనన్య.. ఈత కొట్టాలనే ఉత్సాహంతో సమీపంలోని గట్టు పైనుంచి వాటర్‌లోకి దూకింది. ఆ తర్వాత ఒక్కసారిగా నీటి ఉధృతి పెరిగింది. ఊహించని ప్రవాహంతో ఆమె కొట్టుకుపోయిందని తోటి స్నేహితులు తెలిపారు. స్థానికుల సాయంతో పోలీసులకు సమాచారం ఇచ్చారు.
వెంటనే సంఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు అగ్నిమాపక సిబ్బంది సాయంతో గాలింపు చర్యలు చేపట్టారు. డాక్టర్ అనన్య నీటిలోకి దూకుతున్న దృశ్యాలు ఆమె ఫ్రెండ్ మొబైల్ ఫోన్‌లో రికార్డు అయినట్లు పోలీసులు గుర్తించారు. ఎట్టకేలకు మృతదేహాన్ని బయటకు తీసి పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. కాగా, ఈ ఘటనకు సంబంధించి కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
మరిన్ని క్రైమ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..