Hyderabad Metro: హైదరాబాద్ మెట్రోపై మరో బిగ్ అప్డేట్.. ప్రభుత్వం కీలక నిర్ణయం..

హైదరాబాద్ మెట్రోను ఎల్అండ్‌టీ సంస్థ నుంచి స్వాధీనం చేసుకునే ప్రక్రియ శరవేగంగా జరుగుతోంది. ఇటీవల కేబినెట్‌లో దీనికి ప్రభుత్వం ఆమోదం తెలిపిన విషయం తెలిసిందే. ఎలాంటి లీగల్ సమస్యలు రాకుండా మెట్రో ఆస్తులు ఎల్‌అండ్‌టీ నుంచి తీసుకునేలా పలు ఏజెన్సీలకు ప్రభుత్వం బాధ్యతలు ఇచ్చింది.

Hyderabad Metro: హైదరాబాద్ మెట్రోపై మరో బిగ్ అప్డేట్.. ప్రభుత్వం కీలక నిర్ణయం..
Hyderabad Metro Takeover

Updated on: Mar 02, 2026 | 7:13 AM

హైదరాబాద్ మెట్రో రైలుపై మరో కీలక అప్డేట్ వచ్చింది. హైదరాబాద్ మెట్రోను ఎల్‌అండ్‌టీ సంస్థ నుంచి ప్రభుత్వం స్వాధీనం చేసుకునే ప్రక్రియ షురూ అయింది. ఇటీవల కేబినెట్ సమావేశంలో కూడా ఎల్‌అండ్‌టీ నుంచి స్వాధీనం చేసేందుకు ఆమోదముద్ర వేసింది. దీంతో స్వాధీన ప్రక్రియ మరింత వేగవంతమైంది. ఎప్పటినుంచో స్వాధీన ప్రక్రియ జరుగుతోండగా.. ఇప్పుడు దీని పనులు మరింత వేగవంతమయ్యాయి. ఈ క్రమంలో హైదరాబాద్ మెట్రో రైలుకు సంబంధించి కీలక విషయం బయటకొచ్చింది. మెట్రోను ప్రభుత్వం స్వాధీనం చేసుకున్నా.. నిర్వహణ మాత్రం ప్రైవేట్ సంస్థ చేతుల్లో ఉండనుంది. ప్రభుత్వ పర్యవేక్షణలో థర్డ్ పార్టీ ఏజెన్సీ ఆపరేషన్స్, మెయింటెన్స్‌ను చూసుకోనుంది. ఇందుకు సంబంధించి కీలక సమాచారం బయటకొచ్చింది. వాటి వివరాలు ఏంటో చూద్దాం.

మెట్రో నిర్వహణ ఫ్రాన్స్ సంస్థ చేతుల్లో..

ఫ్రాన్స్‌కు చెందిన కియోలిస్ సంస్థ ప్రస్తుతం మెట్రో ఆపరేషన్స్‌ను చూసుకుంటోంది. గతంలో ఎల్‌అండ్‌టీ ఆ సంస్థతో ఒప్పందం చేసుకోగా.. దాని గడువు నవంబర్ వరకు ఉంది. దీంతో నవంబర్ వరకు కియోలిస్ సంస్థ చేతుల్లోనే మెట్రో నిర్వహణ ఉండనుండగా.. ఆ తర్వాత ప్రభుత్వం నేరుగా నిర్వహణను చూసుకోవడం సాధ్యం కాదు. దీంతో మళ్లీ ఆ సంస్థకు మెట్రో ఆపరేషన్స్ అండ్ మెయింటెన్స్‌ను అప్పగించనుందని సమాచారం. ఒప్పందం గుడువును మరో ఏడాది పాటు పొడిగించనుందని తెలుస్తోంది. ప్రభుత్వం స్వాధీనం చేసుకున్న తర్వాత కూడా నిర్వహణ పరంగా ఎలాంటి తేడాలు ఉండవు అన్నమాట. ప్రభుత్వ ఆధ్వర్యంలో ధర్డ్ పార్టీ ఏజెన్సీ నిర్వహణ బాధ్యతలు చూసుకుంటుందని మెట్రో వర్గాలు చెబుతున్నాయి. ప్రస్తుతం ఎల్‌అండ్‌టీ హైదరాబాద్ మెట్రో రైలు లిమిటెడ్ యాజమాన్యంతో ఉంది. ఇప్పుడు అది ప్రభుత్వానికి బదిలీ కానుంది. దీంతో మెట్రో అనేది ప్రభుత్వ యాజమాన్యంలోకి రానుంది.

ప్రత్యేక కార్పొరేషన్

అప్పుల భారంతో ఎల్‌అండ్‌టీ సంస్థ మెట్రో బాధ్యతల నుంచి తప్పుకోవాలని నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు ప్రభుత్వానికి వినతులు సమర్పించగా.. రేవంత్ సర్కార్ కూడా స్వాధీనం చేసుకునేందుకు ముందుకొచ్చింది. ఎల్‌అండ్‌టీ మెట్రో కోసం బ్యాంకుల కన్సార్షియం నుంచి తీసుకున్న రుణాలు డిసెంబర్ నాటికి రూ.12,965 కోట్లు ఉన్నాయి. అయితే వడ్డీ భారాన్ని తగ్గించేందుకు రీఫైనాన్సింగ్‌కు ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. ఇందుకోసం ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేయనున్నారు. ఇప్పటికే ఇండియన్ రైల్వే ఫైనాన్స్ కార్పొరేషన్ రుణాలను మంజూరు చేసేందుకు ముందుకొచ్చింది. త్వరలోనేర ఈ రుణం ప్రభుత్వానికి అందనుంది. రానున్న కొద్ది నెలల్లో స్వాధీన ప్రక్రియ పూర్తి చేయాలనే ప్రభుత్వం డెడ్ లైన్ విధించింది.

Follow Us