ఆగ్నేయ బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడనున్న నేపథ్యంలో దాని ప్రభావం తెలంగాణపై ఇప్పటి నుంచే ప్రారంభమైంది. తెలంగాణలో పలు జిల్లాలో వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయని వాతావరణ శాఖ తెలిపింది. రానున్న 3 గంటల్లో తెలంగాణలోని పలు జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది.
భారీ ఈదురుగాలతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు అధికారులు తెలిపారు. హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్, మహబూబ్‌నగర్, నాగర్ కర్నూల్, నారాయణపేట, సంగారెడ్డి, వరంగల్, భద్రాద్రి జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఈదురు గాలులు వీచే అవకాశం ఉన్న నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. గంటకు 41 నుంచి 61 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశముందని తెలిపారు.
ఇదిలా ఉంటే ఆదివారం ఆగ్నేయ బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడి, సోమవారం వాయుగుండంగా మారే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం పేర్కొంది. దీని ప్రభావంతో తెలంగాణ రాష్ట్రంలో భారీ వర్షాలు పడే అవకాశం ఉందని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ కేంద్రం సూచించింది. రాష్ట్రానికి మోచా తుఫాను ముప్పు పొంచి ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం నేడు హెచ్చరించింది.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి..