Cyclone Asani: తెలంగాణపై అసని తుఫాన్‌ ప్రభావం.. ఆ జిల్లాల్లో మూడు రోజుల పాటు వర్షాలు..

Cyclone Asani: పశ్చిమధ్య, నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడ్ప అసని తుఫాన్‌ ప్రభావం కారణంగా ఇప్పటికే ఆంధ్రప్రదేశ్‌లో పలు జిల్లాల్లో తీవ్ర వర్షాలు కురుస్తున్న విషయం తెలిసిందే. ఇదిలా ఉంటే తుఫాన్‌ ప్రభావం ఏపీతో పాటు తెలంగాణలోనూ ఉండనున్నట్లు వాతావరణ శాఖ అధికారులు తెలిపారు...

Cyclone Asani: తెలంగాణపై అసని తుఫాన్‌ ప్రభావం.. ఆ జిల్లాల్లో మూడు రోజుల పాటు వర్షాలు..
rayalaseema rains

Updated on: May 10, 2022 | 4:27 PM

Cyclone Asani: పశ్చిమ మధ్య, నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడ్ప అసని తుఫాన్‌ ప్రభావం కారణంగా ఇప్పటికే ఆంధ్రప్రదేశ్‌లో పలు జిల్లాల్లో తీవ్ర వర్షాలు కురుస్తున్న విషయం తెలిసిందే. ఇదిలా ఉంటే తుఫాన్‌ ప్రభావం ఏపీతో పాటు తెలంగాణలోనూ ఉండనున్నట్లు వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. తుఫాన్‌ కారణంగా తెలంగాణలోని పలు ప్రాంతాల్లో రానున్న మూడు రోజుల పాటు ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం కురిసే అవకాశం ఉన్నట్లు అధికారులు తెలిపారు.

తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం ప్రకటించింది. బుధవారం ఖమ్మం, నల్లగొండ, సూర్యపేట, భద్రాద్రి కొత్తగూడెం, మహూబాబాద్‌, ములుగు, జయశంకర్ భూపాలపల్లి, మంచిర్యాల జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నట్లు తెలిపారు. ఇక గంటకు 30 నుంచి 40కి.మీ. వేగంతో ఈదురు గాలులతో కూడిన వర్షం అక్కడక్కడ పడే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ తెలిపింది.

ఇదిలా ఉంటే అసని తుఫాన్‌ ప్రభావంపై అసని తుఫాన్‌పై విశాఖ వాతావరణ కేంద్ర డైరెక్టర్‌ సునంద కీలక ప్రకటన చేశారు. తుఫాన్‌ కాకినాడకు అగ్నేయంగా 260 కిలో మీటర్ల దూరంలో ఉందని తెలిపారు. ప్రస్తుతం తుఫాన్‌ మచిలీపట్నం వైపుగా ప్రయాణిస్తోందని, దిశ మార్చుకునే అవకాశం ఉందని ఆమె తెలిపారు. అయితే తుఫాన్‌ తీరం దాటడంపై ఇంకా ఎలాంటి స్పష్టత రాలేదని, తీరం దాటకుండానే బలహీన పడే అవకాశముందని ఆమె పేర్కొన్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని వాతావరణ వివరాల కోసం క్లిక్ చేయండి..