పచ్చని అడవుల్లో కుప్పలు తెప్పలుగా గోల్డ్ కాయిన్స్.. ఇంతకూ అక్కడికెలా వచ్చాయంటే?

ఎప్పుడూ పచ్చని అడవల మధ్య తిరిగే మావోయిస్టులకు అన్ని ఆయుధాలు కొనుగోలు చేసేందుకు, వాళ్ల మనుగడకు డబ్బులు ఎలా వస్తాయనేది చాలా మందికి ఉన్న ఓ డౌట్.. కానీ తాజాగా పోలీసులు జరిపిన ఓ ఆపరేషన్‌లో ఈ విషయం బట్టబయలైంది. మావోయిస్టుల ఆర్థిక వనరులపై సంచలన వివరాలు బయటపడ్డాయి. వీరు కాంట్రాక్టర్ల ద్వారా నిధులను సేకరిస్తున్నట్టు పోలీసులు గుర్తించారు.

పచ్చని అడవుల్లో కుప్పలు తెప్పలుగా గోల్డ్ కాయిన్స్.. ఇంతకూ అక్కడికెలా వచ్చాయంటే?
Maoist Funding Hyderabad

Edited By:

Updated on: May 03, 2026 | 1:10 PM

హైదరాబాద్‌లో మావోయిస్టుల ఆర్థిక వనరులపై సంచలన వివరాలు వెలుగులోకి వచ్చాయి. కాంట్రాక్టర్ల ద్వారానే మావోయిస్టులు తమ నిధిని సమకూర్చుకున్నట్లు పోలీసులు గుర్తించారు. 2024లో సుమారు రూ.1.5 కోట్ల వరకు “వార్ చెస్ట్” నిర్మించుకున్నట్లు పోలీసుల విచారణలో తేలింది. ముఖ్యంగా ఈ నిధిలో పెద్ద భాగాన్ని నగదు రూపంలో కాకుండా బంగారు నాణేల రూపంలో నిల్వ చేసినట్లు అధికారులు గుర్తించారు.

మావోయిస్టులు సిస్టమాటిక్‌గా ఒక నెట్‌వర్క్ ఏర్పాటు చేసి కాంట్రాక్టర్లు, వ్యాపారుల నుంచి డబ్బులు సేకరించినట్టు పోలీసులు తెలుసుకున్నారు. స్టేట్ కమిటీ స్థాయిలో నిధుల సేకరణ జరగగా.. ఆ డబ్బులను కేంద్ర కమిటీ సభ్యులు పంపకాలు చేసినట్టు గుర్తించారు. దళాల కార్యకలాపాలకు అవసరమైన నిధులను కూడా ఈ వ్యవస్థ ద్వారానే విడుదల చేసినట్లు సమాచారం. భద్రతా బలగాల ఒత్తిడి, అంతర్గత విభేదాలు ఉన్నప్పటికీ ఈ ఫండింగ్ వ్యవస్థ కొనసాగినట్లు దర్యాప్తులో బయటపడింది.

ఇక నగదు బదులు బంగారాన్ని ఎంచుకోవడానికి కూడా ప్రత్యేక కారణాలున్నాయని పోలీసులు చెబుతున్నారు. డీమోనిటైజేషన్ వంటి ఆర్థిక మార్పులు, అడవుల్లో ఆస్తి రక్షణ సమస్యలను దృష్టిలో పెట్టుకుని బంగారం రూపంలో నిల్వ ఉంచినట్లు పోలీసులు భావిస్తున్నారు. బంగారం సులభంగా దాచుకోవచ్చు, తరలించుకోవచ్చు కావడం కూడా ప్రధాన కారణంగా పేర్కొంటున్నారు.
అయితే ఇటీవల భద్రతా బలగాల దాడులు పెరగడంతో మావోయిస్టుల కార్యకలాపాలపై ప్రభావం పడినట్లు సమాచారం.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us