Hyderabad News: ఈ లోకంలో అమ్మని, అమ్మ ప్రేమను మించింది మరోటి లేదంటే అతిశయోక్తి కాదు. నవమాసాలు మోసి, కని, పెంచి కంటికి రెప్పలా కాపాడుతుంది అమ్మ. అలాంటి అమ్మ ప్రతి ఒక్కరికి చాలా స్పెషల్ అనే చెప్పాలి. అయితే, ఇక్కడ ఓ వ్యక్తి తన అమ్మపై ఉన్న ప్రేమను వినూత్న రీతిలో వ్యక్తపరిచాడు. అమ్మ చనిపోయినా ఆమె జ్ఞాపకాలను మా త్రం పదిలం చేసుకున్నాడు ఓ కుమారుడు. కాలం చేసిన అమ్మ రూపాన్ని ఇంట్లోనే ప్రతిష్టించుకుని కంటినిండుగా చూసుకుంటున్నాడు మేడ్చల్ జిల్లా దుండిగల్‌కి చెందిన వ్యక్తి.
వివరాల్లోకెళితే.. రామ్‌కుమార్ దుండిగల్ పురపాలిక పరిధి సింహపురి కాలనీలో నివసిస్తున్నాడు. ఇతని తల్లి ఆళ్ల విజయలక్ష్మి. అమ్మంటే రామ్‌కు ప్రాణం. గతేడాది మే 26న కరోనా ఆమెను పొట్టనబెట్టుకుంది. తల్లి ఆకాల మరణాన్ని జీర్ణించుకోలేకపోయిన అతడు ఇంటినిండా ఆమె ఫోటోలతో నింపేశాడు. ప్రత్యేకంగా ఆమె బొమ్మను గీయించి దైవంగా కొలిచినప్పటికీ ఏదో వెలితి అతన్ని వెంటాడింది. అలా చివరకు అమ్మకు విగ్రహం చేయించాలని నిర్ణయించుకున్నాడు. తల్లి ప్రతిరూపం నిత్యం కళ్ల ఎదుటే ఉండేలా పాల రాతితో విగ్రహాన్ని చేయించాలని మూడు నెలల క్రితం రాజస్థాన్ వెళ్లి ఆర్డర్ ఇచ్చాడు. రెండు రోజుల కిందట అందిన మూడున్నర అడుగుల విగ్రహాన్ని ఇంట్లోనే ప్రతిష్టించాడు. విగ్రహం తయారీకి లక్ష రూపాయల ఖర్చు అయిందని చెప్పారు. విగ్రహాన్ని చూస్తుంటే తల్లి ఇంట్లోనే ఉన్నట్టుగా అనిపిస్తుందన్నారు.
Also read:
Bhanu Shree: వయ్యారాలు వకబోస్తున్న భాను.. వావ్ అంటున్న ఫ్యాన్స్..
King Of Hearts Mustache: పేక ముక్కల్లో ఉండే కింగ్స్‌లో ఒక రాజుకు మీసాలుండవు.. ఎందుకో తెలుసా?
Bharat Pe News: ఫోన్ పే లో వాటాలు అమ్మే ప్రయత్నాల్లో సహవ్యవస్థాపకుడు..