Hyderabad: అతను ధరించింది ఫేక్‌ గోల్డా.. టీవీ9తో అసలు విషయం చెప్పిన సూర్య

ఎప్పుడూ ఒంటి నిండా బంగారంతో కనిపిస్తూ సిటీలో గోల్డ్‌ మెన్‌గా పేరు గాంచిన సూర్యా భాయ్.. అదే బంగారంతో మరోసారి హాట్‌టాపిక్‌గా మారారు. ఆయన ధరించిందంతా ఫేక్‌ గోల్డ్ అని సోషల్‌ మీడియాలో తెగ ప్రచారం సాగుతోంది. అయితే దీనిపై తాజాగా సూర్యా భాయ్ స్పందించారు. ఇంతకూ ఈ సోషల్ మీడియా ప్రచారంపై ఆయన ఏమన్నారో చూద్దాం పదండి.

Hyderabad: అతను ధరించింది ఫేక్‌ గోల్డా.. టీవీ9తో అసలు విషయం చెప్పిన సూర్య
Gold Man Surya Bhai Clarifies Fake Gold Row

Updated on: Mar 30, 2026 | 2:47 PM

తాను ధరించిన బంగారం అంతా ఫేక్ అని సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారంపై గోల్డ్‌ మ్యాన్ అనియాస్ సూర్య స్పందించారు. ఆయన టీవీ9తో మాట్లాడుతూ.. తాను చాలా కష్టపడి పైకి వచ్చానని.. ఫేక్ గోల్డ్ వేసుకోవాల్సిన ఖర్మ తనకేం పట్టలేదని తెలిపారు. ఐటీ వాళ్ళు తమ ఇంటికి వచ్చిన మాట వాస్తవమేనని.. కానీ వాళ్లు కొన్ని ఆభరణాలు మాత్రమే కొల్చారని అన్నారు. ఐటీ వాళ్ళు ఇంకా విచరణ పూర్తి చేయకుండానే తన గోల్డ్ వ్యాల్యూ 3 లక్షలు అని అంటారన్నారు.

తాను గోల్డ్ ఎస్కున్నా, నకిలీ గోల్డ్ ఏసుకున్నా పక్క వాళ్లకి వచ్చే నష్టం ఏముందని అన్నారు. తాను బిల్డప్ కొట్టే వాడిని కాదని.. తాను ఎక్కడ తన ఒంటి మీద ఇన్ని కిలోల గోల్డ్ ఏసుకున్నాను అని చెప్పలేదన్నాడు. తాను ధరించింది, నిజమైన బంగారమో, నకిలీ బంగారమో తనను నమ్మిన వాళ్లకు తెలుసని చెప్పారు. తనను చూసి కొందరు కుళ్లుకుంటున్నారని అన్నారు.తాను సినిమా యాక్టర్ అని, రియల్ ఎస్టేట్ చేస్తానని.. తనపై రాళ్ళు పడటం సహజం అని అన్నారు.

భారత దేశంలో ఎవరు ధరించలేని కడియం తాను ధరించానని.. తన కడియం బరువే 250 గ్రాములు ఉంటుందని.. రాగితో ఇలాంటిది రాదని తెలిపారు. తాను అలా ఫోజ్ కొట్టేవాడిని కాదని.. తానను తాను నిరూపించుకోవాల్సిన అవసరం లేదన్నారు. వందల కోట్లు ఉన్నా కూడా అద్దె ఇంట్లో ఉండే వాళ్లు ఉంటారు.. తాను కూడా అంతే 2022 వరకు తాను ఐటీ రిటర్న్ ఫైల్ చేశానన్నారు. రాజకీయ ముసుగులో ఎంతో మంది ఉన్నారని.. వాళ్లను వదిలేసి తనను ఎందుకు టార్గెట్ చేశారో తెలియట్లేదన్నారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us