Hyderabad: మణికొండలో భారీ అగ్నిప్రమాదం.. చూస్తుండగానే కాలిపోయిన దుకాణం!

హైదరాబాద్‌లో ఆదివారం రాత్రి భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. మణికొండలో ఉన్న బీఆర్‌సీ బిల్డింగ్‌ సమీపంలోని ఓ షాప్‌లో గ్యాస్ సిలిండర్ ఒక్కసారిగా పేలిపోయింది. దీంతో భయపడిపోయిన జనాలు అక్కడి నుంచి పరుగులు తీశారు. సమాచారంతో ఘటనా స్థలానికి చేరుకున్న ఫైర్ సిబ్బంది. మంటలను అదుపుచేశారు.

Hyderabad: మణికొండలో భారీ అగ్నిప్రమాదం.. చూస్తుండగానే కాలిపోయిన దుకాణం!
Hyderabad Gas Cylinder Blast

Edited By:

Updated on: Sep 14, 2026 | 7:11 AM

రంగారెడ్డి జిల్లా మణికొండలో భారీ అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. బీఆర్‌సీ బిల్డింగ్‌ సమీపంలోని ఓ వాణిజ్య దుకాణంలో అకస్మాత్తుగా గ్యాస్ సిలిండర్ పేలడంతో భారీగా మంటలు చెలరేగాయి. ఒక్కసారిగా పెద్ద శబ్దం రావడంతో స్థానికులు ఉలిక్కిపడ్డారు. ఆ వెంటనే దుకాణం నుంచి మంటలు ఎగసిపడటంతో చుట్టుపక్కల ఉన్న వారు భయంతో బయటకు పరుగులు తీశారు. ప్రమాదంపై సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది వెంటనే ఘటనాస్థలానికి చేరుకున్నారు.

పరిస్థితిని పరిశీలించి మంటలు మరింత విస్తరించకుండా ఆర్పే ప్రయత్నం చేశారు అగ్నిమాపక అధికారులు శ్రమించి మంటలను పూర్తిగా అదుపులోకి తీసుకువచ్చారు. సిలిండర్ పేలుడు సమయంలో దుకాణం సమీపంలో ఎవరైనా ఉన్నారా? ప్రమాదానికి దారితీసిన పరిస్థితులు ఏమిటి? గ్యాస్ లీకేజీ కారణంగానే సిలిండర్ పేలిందా? అనే విషయాలపై అధికారులు ఆరా తీస్తున్నారు.

అదృష్టవశాత్తూ ఈ ఘటనలో ఎవరికి ఎలాంటి గాయాలు కాలేదు. దీంతో స్థానికులు, అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. అయితే ప్రమాద సమయంలో మంటలు పెద్ద ఎత్తున ఎగసిపడటంతో చుట్టుపక్కల ప్రాంతాల్లో కొద్దిసేపు ఆందోళన వాతావరణం నెలకొంది. అగ్ని ప్రమాదానికి అసలు కారణం ఏంటన్నది అధికారుల పూర్తి విచారణ తర్వాతే స్పష్టమయ్యే అవకాశం ఉంది.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Loading...
Unable to load recommendations.
Follow Us