Hyderabad: భాగ్యనగరం నడిబొడ్డులో డ్రగ్స్ కలకలం.. ఐదుగురు విద్యార్థులు అరెస్ట్..!

తెలంగాణలో డ్రగ్స్ నెట్‌వర్క్‌పై పోలీసులు ఉక్కుపాదం మోపుతున్నారు. ఎన్ని సీరియస్‌ వార్నింగ్‌లు ఇస్తున్నా.. ఎంత మందిని అరెస్టు చేస్తున్నా.. ఎంతగా నిఘా పెడుతున్నా డ్రగ్స్‌ కేసులు మాత్రం ఆగడం లేదు. ఇటీవల ముఖ్యంగా కాలేజీ స్టూడెంట్సే ఈ డ్రగ్స్ కేసుల్లో పట్టుబడడం ఆందోళన కలిగిస్తోంది. ఈగల్ టీమ్ నిర్వహించే ఆపరేషన్లలో షాకింగ్ నిజాలు బయటపడుతున్నాయి.

Hyderabad: భాగ్యనగరం నడిబొడ్డులో డ్రగ్స్ కలకలం.. ఐదుగురు విద్యార్థులు అరెస్ట్..!
Hyderabad Drugs

Updated on: Jan 25, 2026 | 10:18 AM

తెలంగాణలో డ్రగ్స్ నెట్‌వర్క్‌పై పోలీసులు ఉక్కుపాదం మోపుతున్నారు. ఎన్ని సీరియస్‌ వార్నింగ్‌లు ఇస్తున్నా.. ఎంత మందిని అరెస్టు చేస్తున్నా.. ఎంతగా నిఘా పెడుతున్నా డ్రగ్స్‌ కేసులు మాత్రం ఆగడం లేదు. ఇటీవల ముఖ్యంగా కాలేజీ స్టూడెంట్సే ఈ డ్రగ్స్ కేసుల్లో పట్టుబడడం ఆందోళన కలిగిస్తోంది. ఈగల్ టీమ్ నిర్వహించే ఆపరేషన్లలో షాకింగ్ నిజాలు బయటపడుతున్నాయి.

తాజాగా హైదరాబాద్‌ మహానగరం నడిబొడ్డులో డ్రగ్స్ కలకలం సృష్టిస్తోంది. పంజాగుట్టలో పోలీసులు ఐదుగురిని అదుపులోకి తీసుకున్నారు. డ్రగ్స్ తీసుకుంటూ దొరికిన వీళ్లంతా విద్యార్థులే కావడం విశేషం. ఒకే కాలేజ్‌లో చదువుకుంటున్న విద్యార్థులు డ్రగ్స్ తీసుకుంటున్నారన్న సమాచారం పోలీసులు దాడులు నిర్వహించారు. దీంతో విద్యార్థులు రెడ్‌హ్యండెడ్‌గా పట్టుబడ్డారు. వీళ్ల నుంచి 10 గ్రాముల MDMA స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు.

పంజాగుట్ట పోలీస్ స్టేషన్ పరిధిలోని నాగార్జున సర్కిల్‌ దగ్గర ఈ డ్రగ్స్‌ దందాకి సంబంధించిన సమాచారం రావడంతో పోలీసులు సోదాలు చేసి వీరిని అరెస్టు చేశారు. వీళ్లకు డ్రగ్స్‌ ఎవరు సరఫరా చేస్తున్నారు.. ఈ నెట్‌వర్క్‌లో ఇంకా ఎవరెవరు ఉన్నారనే దానిపై విచారణ చేస్తున్నారు. మరోవైపు ఈ డ్రగ్ కల్చర్‌పై తెలంగాణ పోలీస్ శాఖ సీరియస్ యాక్షన్‌కు దిగింది. నిందితులు ఎవరైనా, ఎంతటి వారైనా వదిలే ప్రసక్తే లేదని హెచ్చరిస్తోంది. యువతను మత్తు ఊబిలోకి లాగుతున్న ఇలాంటి ముఠాల సమాచారం తెలిస్తే వెంటనే సమాచారం ఇవ్వాలని పోలీసులు కోరారు.

మరిన్ని క్రైమ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..