
తెలంగాణలో రైతంగానికి హైదరాబాద్ వాతావరణం కేంద్ర చల్లని కబురు చెప్పింది. రాష్ట్రంలో రాబోయే మూడు రోజులు పాటు వర్షాలు కురిసే సూచనలు ఉన్నట్టు తెలిపింది. వాతావరణ శాఖ ప్రకారం.. ప్రస్తుతం సగటు సముద్ర మట్టం వద్ద ఉన్న రుతుపవన ద్రోణి అమృత్‌సర్, అంబాలా, ముజఫర్‌నగర్, ఆగ్నేయ ఉత్తరప్రదేశ్‌లోని అల్పపీడన ప్రాంతం, రాంచీ, దిఘా మీదుగా ఆగ్నేయ దిశగా ఈశాన్య బంగాళాఖాతం వరకు విస్తరించి ఉందని.. గురువారం తెల్లవారుజామున 05:30 గంటల సమయంలో తెలంగాణ, రాయలసీమ సరిహద్దుల్లో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం ప్రస్తుతం దక్షిణ తెలంగాణ, దాని పరిసర ప్రాంతాల్లో కేంద్రీకృతమై ఉంది. ఇది సముద్ర మట్టానికి సుమారు 5.8 కిలోమీటర్ల ఎత్తు వరకు విస్తరించి ఉంది.
పశ్చిమ మధ్య – వాయువ్య బంగాళాఖాతం, ఉత్తర ఆంధ్రప్రదేశ్ – దక్షిణ ఒడిశా తీరాల్లో గతంలో కొనసాగిన మరో ఉపరితల ఆవర్తనం క్రమంగా కదిలి వాయువ్య బంగాళాఖాతం, బంగ్లాదేశ్ పరిసర ప్రాంతాలకు చేరింది. దీని ప్రభావంతో రాష్ట్రంలో రాబోయే 24 గంటల పాటు వర్షాలు కురిసే అవకాశం ఉందిని తెలిపింది.
ఈబోయే 24 గంటల్లో ఈ జిల్లాల్లో వర్షాలు
తెలంగాణలోని పలు జిల్లాల్లో రాబోయే 24 గంటల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం, గంటకు 30 నుండి 40 కి.మీ వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. ముఖ్యం ఉత్తర, తూర్పు తెలంగాణలోని ఆదిలాబాద్ , కొమరం భీమ్ ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్ , నిజామాబాద్ , జగిత్యాల , పెద్దపల్లి , కరీంనగర్, రాజన్న సిరిసిల్ల, జయశంకర్ భూపాలపల్లి , ములుగు , భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, మహబూబాబాద్ , వరంగల్ , హన్మకొండ జిల్లాల్లో వర్షాలు కురుస్తాయని తెలిపింది.
పశ్చిమ తెలంగాణలోని ఈ జిల్లాల్లో వర్షాలు
ఇక పశ్చిమ తెలంగాణలోని కామారెడ్డి, మెదక్, సంగారెడ్డి, వికారాబాద్ జిల్లాలతో పాటు హైదరాబాద్ , మేడ్చల్-మల్కాజ్‌గిరి , రంగారెడ్డి జిల్లా, నల్గొండ, సూర్యాపేట, మహబూబ్ నగర్ జిల్లాల్లో మోస్తరు నుంచి తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ స్పస్టం చేసింది.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.