Karimnagar District: దసరా, ఉప ఎన్నిక ఎఫెక్ట్.. 2 రోజుల్లో మద్యం అమ్మకాలు ఎంతో తెలిస్తే మైండ్ బ్లాంక్

|

Oct 17, 2021 | 1:27 PM

ఒకవైపు దసరా..మరోవైపు ఉప ఎన్నిక..ఇంకేముంది. ఆ కిక్కే వేరు. పండుగ రెండ్రోజుల్లో కరీంనగర్‌ జిల్లాలో మద్యం అమ్మకాలు రికార్డ్‌ సృష్టించాయి.

Karimnagar District: దసరా, ఉప ఎన్నిక ఎఫెక్ట్.. 2 రోజుల్లో మద్యం అమ్మకాలు ఎంతో తెలిస్తే మైండ్ బ్లాంక్
Liquor Sales
Follow us on

ఒకవైపు దసరా..మరోవైపు ఉప ఎన్నిక..ఇంకేముంది. ఆ కిక్కే వేరు. పండుగ రెండ్రోజుల్లో కరీంనగర్‌ జిల్లాలో మద్యం అమ్మకాలు రికార్డ్‌ సృష్టించాయి. ఒక్క కరీంనగర్‌ జిల్లాలోనే 23కోట్ల రూపాయలకు పైగా మద్యం తాగేశారు మందుబాబులు. ఇక బైపోల్‌ జరిగే హుజూరాబాద్‌లో మద్యం ఏరులై పారుతోంది. మద్యం అమ్మకాలు మరింత పెరిగాయి. వైన్‌ షాపుల ముందు క్యూ కట్టారు. మద్యం సరిపోకపోవడంతో బయటినుంచి కూడా తెప్పించి అమ్మాల్సిన పరిస్థితి.

ఇక హూజూరాబాద్‌ అసెంబ్లీ నియోజక వర్గంలో మద్యం అమ్మకాలు భారీ ఎత్తున పెరిగాయి. రాజకీయ పార్టీ ప్రచారాలు ఊపందుకోవడంతో మద్యానికి డిమాండ్‌ పెరిగింది. ఇప్పటికే అన్ని పార్టీలకు చెందిన నాయకులు అక్కడే మకాం వేశారు. ఊరూరా, గడపగడపకు తిరుగుతూ ప్రచారం నిర్వహిస్తున్నారు. బయట ప్రాంతాలకు చెందిన నాయకులు, ఆయా పార్టీల శ్రేణులు రావడంతో మద్యం సేల్స్ బాగా పెరిగాయని ఎక్సైజ్‌ అధికారులు అభిప్రాయపడుతున్నారు. నియోజక వర్గంలో ఇల్లందుకుంట, హుజూరాబాద్‌, జమ్మికుంట, వీనవంక మండలాలు కరీంనగర్‌ జిల్లా పరిధిలో ఉండగా కమలాపూర్‌ మండలం మాత్రం హనుమకొండ పరిధిలో ఉంది. ఈ క్రమంలో  సెప్టెంబరు నెలలో మొదటి రెండు వారాల్లో కరీంనగర్‌ జిల్లాలో రూ.63.82 కోట్లు విలువైన లిక్కర్ సేల్ అవ్వగా… వరంగల్‌ జిల్లాలో రూ.71.18 కోట్లు విలువైన మద్యం విక్రయాలు జరిగాయి. ఈ నెల మొదటి రెండు వారాల్లో జరిగిన మద్యం అమ్మకాలను పరిశీలిస్తే… కరీంనగర్‌ జిల్లాలో రూ.102.36 కోట్లు విలువ చేసే మద్యం అమ్మకాలు జరగ్గా… వరంగల్ జిల్లా పరిధిలో ఏకంగా రూ. 115.69 కోట్లు విలువ చేసే మద్యం అమ్ముడు పోయింది. ఉప ఎన్నికకు టైమ్ దగ్గర పడుతోన్న నేపథ్యంలో లిక్కర్ సేల్స్ మరింత పెరుగుతాయని అబ్కారీ శాఖ అధికారులు చెబుతున్నారు.

హోల్ సేల్ షాప్ నుండి ఆయా గ్రామాలకు మద్యం రవాణా చేయడానికి కొంతమంది వ్యక్తులను నియమించుకోవడం.. మద్యం ప్రియులకు నచ్చిన లిక్కర్, బీర్లను అందించడానికి కొన్ని షాపులలో ఖాతాలు తెరవడం… చీటీల మీద రాసి ఇస్తే మద్యం బాటిల్ ఇచ్చే విధంగా ఏర్పాటు చేయడం వంటివి హుజురాబాద్ నియోజకవర్గంలో ప్రజంట్ కనిపిస్తోన్న చిత్రాలు.

Also Read: వాహనాలకు ఫేక్ స్టిక్కర్లు వేస్తున్నారా..? అయితే మీరు బుక్ అయినట్లే

లేటైనా కాస్త ఘాటుగా… ‘మా’ పరిణామాలపై ఆర్జీవీ సంచలన ట్వీట్