Hen dead Suddenly: పోలీస్ మెట్లు ఎక్కిన కోడి పంచాయతీ… నా కోడిని చంపేశారంటూ ఓ వ్యక్తి ఫిర్యాదు

Hen dead Suddenly: రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఓ విచిత్ర సంఘటన చోటు చేసుకుంది. నిత్యం కేసులు, దర్యాప్తులతో బిజీబిజీగా ఉండే ఖాకీలకు ఓ కోడి కేసు...

Hen dead Suddenly: పోలీస్ మెట్లు ఎక్కిన కోడి పంచాయతీ... నా కోడిని చంపేశారంటూ ఓ వ్యక్తి ఫిర్యాదు

Updated on: Apr 21, 2021 | 6:13 PM

Hen dead Suddenly: రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఓ విచిత్ర సంఘటన చోటు చేసుకుంది. నిత్యం కేసులు, దర్యాప్తులతో బిజీబిజీగా ఉండే ఖాకీలకు ఓ కోడి కేసు తగిలింది. కోడి పంచాయతీ పోలీస్ స్టేషన్ మెట్లెక్కింది. చచ్చిన కోడితొ కొందరు పోలీస్ స్టేషన్‌కు రావటంతో ఇప్పుడి వార్త హాట్ టాపిక్‌గా మారింది.

చందుర్తి మండలం బండపల్లి గ్రామానికి చెందిన గశికంటి రాజు అనే వ్యక్తి తన కోడిని చంపేశారంటూ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. తన కోడిని అమానుషంగా ఇసుక ట్రాక్టర్ తో గుద్ధి చంపారని బాధితుడు మంగళవారం చనిపోయిన కోడిని తీసుకొని వచ్చి చందుర్తి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. అల్లారుముద్దుగా పెంచుకుంటున్న కోడి చనిపోవడంతో తనకు న్యాయం చేయాలని పోలీసు మెట్లెక్కినట్లు రాజు చెబుతున్నారు.

అయితే, కోడితో రాజు స్టేషన్‌కు రావడం చూసి అక్కడున్న పోలీసులు తెగ నవ్వుకున్నారు. మరి ఈ కేసును పోలీసులు ఎలా విచారిస్తారు..రాజుకు ఎలా న్యాయం చేస్తారో చూడాలి మరీ..!

 

Also Read: మొబైల్స్.పై కూడా కరోనా వైరస్.. స్మార్ట్ ఫోన్స్ ను సురక్షితంగా శుభ్రం చేసుకోవడం ఎలా అంటే..!

Loading...
Unable to load recommendations.
Follow Us