Heat Wave: మండుతున్న ఎండలు.. తెలంగాణలో 44 డిగ్రీల పైనే ఉష్ణోగ్రతలు, ఆ జిల్లాలు అలర్ట్

|

Mar 31, 2024 | 1:14 PM

తెలంగాణలో ఉష్ణోగ్రతలు 44 డిగ్రీల సెల్సియస్ కు చేరే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. ఏప్రిల్ 3 వరకు రాష్ట్రంలోని వివిధ జిల్లాల్లో ఉష్ణోగ్రతలు 41 నుంచి 44 డిగ్రీల సెల్సియస్ వరకు నమోదయ్యే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. తెలంగాణలో ఉష్ణోగ్రతలు పెరుగుతుండటంతో వడగాలుల హెచ్చరిక జారీ చేసిన హైదరాబాద్ వాతావరణ కేంద్రం.

Heat Wave: మండుతున్న ఎండలు.. తెలంగాణలో 44 డిగ్రీల పైనే ఉష్ణోగ్రతలు, ఆ జిల్లాలు అలర్ట్
Summer Effect
Follow us on

రోజురోజుకూ ఎండలు తీవ్రరూపం దాల్చుతున్నాయి. ఉదయం 8 గంటల నుంచే సూర్యుడు సెగలు కక్కుతున్నాడు. ఫలితంగా వ్యాపారులు, జనాలు, విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. తెలంగాణలో ఉష్ణోగ్రతలు 44 డిగ్రీల సెల్సియస్ కు చేరే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. ఏప్రిల్ 3 వరకు రాష్ట్రంలోని వివిధ జిల్లాల్లో ఉష్ణోగ్రతలు 41 నుంచి 44 డిగ్రీల సెల్సియస్ వరకు నమోదయ్యే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. తెలంగాణలో ఉష్ణోగ్రతలు పెరుగుతుండటంతో వడగాలుల హెచ్చరిక జారీ చేసిన హైదరాబాద్ వాతావరణ కేంద్రం ఏప్రిల్ 1న నిర్మల్, నిజామాబాద్ జిల్లాల్లో వడగాల్పులు వీచే అవకాశం ఉన్నట్టు తెలిపింది.

ఏప్రిల్ 2న ఆదిలాబాద్, కుమరం భీం, నిర్మల్, మంచిర్యాల, నిజామాబాద్, జగిత్యాల, పెద్దపల్లి, కరీంనగర్, భూపాలపల్లి, ములుగు, కామారెడ్డి, నల్లగొండ, సూర్యాపేట, ఖమ్మం జిల్లాలకు వడగాలుల హెచ్చరికలు జారీ చేశారు. ఈ జిల్లాలతో పాటు వనపర్తి, నాగర్ కర్నూల్, నారాయణపేట, మహబూబ్ నగర్ లలో కూడా ఏప్రిల్ 3, 4 తేదీల్లో వడగాలులు వీచే అవకాశం ఉంది. ఉష్ణోగ్రతలు 44 డిగ్రీల సెల్సియస్ కు చేరుకునే అవకాశం ఉంది.

ఇంటర్ గవర్నమెంటల్ ప్యానెల్ ఆన్ క్లైమేట్ చేంజ్ (ఐపిసిసి) ప్రకారం.. రాబోయే రోజుల్లో వడగాలులు వీచే అవకాశం ఉన్నట్టు తెలిపింది. అయితే సాధారణ ఎండ వేడిమి కంటే రెండింతలు ఎక్కువగా ఉంటుంది. అయితే రెండు రోజుల నుండి నెలల వరకు ఉండే ఆ ఎఫెక్ట్ ఉండే అవకాశం ఉంది. తెలంగాణలోని పలు జిల్లాల్లో ఉష్ణోగ్రతలు 44 డిగ్రీల సెల్సియస్ వరకు నమోదవుతుండటంతో ఏప్రిల్ 3 వరకు వడగాలులు ఉంటాయని హెచ్చరికలు జారీ చేసింది హైదరాబాద్ వాతావరణ కేంద్రం.