
Women’s Under-19 T20 Super League: హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ (Hyderabad Cricket Association – HCA) మహిళల అండర్-19 (Women’s Under-19) విభాగంలో నిర్వహించనున్న టీ20 సూపర్ లీగ్ (T20 Super League) టోర్నీకి సంబంధించి మొత్తం ఎనిమిది జట్లను మంగళవారం అధికారికంగా వెల్లడించింది. క్రికెట్‌లో అత్యంత పొట్టి ఫార్మాట్‌లో వర్ధమాన మహిళా క్రికెటర్ల సత్తా చాటేందుకు ఈ లీగ్ వేదిక కానుంది. యువ క్రీడాకారిణులకు నాణ్యమైన మ్యాచ్ అనుభవం కల్పించడంతో పాటు ప్రతిభావంతులను గుర్తించే లక్ష్యంతో ఈ జట్లను ఎంపిక చేశారు. హైదరాబాద్ నగరంతో పాటు వివిధ జిల్లాలకు చెందిన ప్రతిభావంతులైన అమ్మాయిలకు ఈ జట్లలో చోటు దక్కింది. ఈ పోటీల్లో ఉత్తమ ప్రదర్శన కనబరిచిన ఆటగాళ్లకు భవిష్యత్తులో ఉన్నత స్థాయి అవకాశాలు దక్కే వీలుంది.
జట్ల వివరాల్లోకి వెళితే, టీమ్ ఏ+ జట్టుకు కమ్మిలి నిధి (Kammili Nidhi) కెప్టెన్, వికెట్ కీపర్‌గా వ్యవహరించనున్నారు. ఈ జట్టులో సి.దీక్షిత, జాజ్మిన్ గిల్, బి.కీర్తన, అక్షర గుండు, కె.అర్పిత, దృవిజ్ఞ, అల్లం సృష్టి, సిమ్రాన్ యాదవ్, శ్రీజ, మిద్దెల లికిల (నల్గొండ), ముదావత్ సింధుజ ఎంపికయ్యారు.
టీమ్ బి+ బృందానికి జి.కావ్య శ్రీ (G. Kavya Sree) కెప్టెన్‌గా బాధ్యతలు చేపట్టగా, నందిగామ అక్షయ, ఆదిమూలం హాసిని, బి.గీతిక ప్రియదర్శిని, వేముల జెనిక్ష, ఆయిషా షేక్, తూము అనన్య, రుక్సార్, ప్రవళిక, తలారి సంసిత, పన్యాల సహస్ర, ప్రణవి సభ్యులుగా ఉన్నారు.
టీమ్ సి+ జట్టుకు కట్టా తేజస్విని (Katta Tejaswini) సారథ్యం వహిస్తుండగా, ప్రతీక కంచర్ల, ఎడ్ల దర్శిని, లింగంపల్లి లక్ష్మి సహస్ర, జి.హేష్మిత శ్రీ, సుప్రీత, బుక్య శారద, నక్కా నిధి కృష్ణ, మేఘన గౌడ్, పట్టిక షాన్వి, సామల చిద్విలాసిని, అంకెనగారి సుచరిత స్థానం సంపాదించారు.
టీమ్ డి+ జట్టుకు ఎం.శ్రీ గ్రంధ (M. Sree Grandha) నాయకత్వం వహిస్తున్నారు. ఇందులో ఆర్.లలిత, సజ్జా నాగ శ్రీ చరిత, ఎన్.నీతా శాశ్వత, ప్రతీక, టి.జాహ్నవి, పి.తనుషిక, కె.సహస్ర, ఝాన్సీ, లకవత్ చైతన్య, కన్నం శ్రేయ, సోనాలి ఆడనున్నారు.
టీమ్ ఈ+ జట్టు పగ్గాలను ఎం.చార్వి లక్ష్మి శ్రీ (M. Charvi Lakshmi Sree) అందుకోగా, వై.ఈశ్వరి, ఎం.అక్షిత గౌడ్, సాయి తనుశ్రీ, స్వాగతిక పాండ, సి.నాగ రూపిణి, పోలమ శ్రీవాస్తవ, పెవల్ తనీష, ముత్యాల అనిక, వానరాసి ప్రసన్న, సి.జయ కాత్యాయని, బుచ్చి హాసిని ఉన్నారు.
మిగిలిన జట్లలో టీమ్ ఎఫ్+ జట్టుకు ఎన్.బబిత (N. Babitha) కెప్టెన్‌గా ఉండనున్నారు. సి.నాగసాయి అక్షిత, బొక్క దీప్షిక, డి.అనన్య, టి.హర్షిణి, వూర్క రిషిమ, డి.నిష్ట, ధరావత్ రిషిక, ఇ.గౌతమి, పూర్వ లాహోటి, నవురు సంజన, ఎ.జుచితా రెడ్డి జట్టులో చోటు దక్కించుకున్నారు.
టీమ్ జి+ బృందాన్ని ప్రతీక్ష వెంకటేష్ (Prathiksha Venkatesh) నడిపించనుండగా, శరగూడం మిత్ర, పి.బంధన, హీరల్ జోషి, ధరావత్ శ్రావణి, యమున, అక్కీ ఆశ్రిత, ఆస్థా శర్మ, సముద్రాల ఇనాయ, శ్రీ సహస్ర రాజ్, డి.ప్రణవి, ఉదయ చంద్రిక బరిలోకి దిగుతారు.
ఇక టీమ్ హెచ్+ జట్టుకు పి.అక్షయ రెడ్డి (P. Akshaya Reddy) సారథిగా వ్యవహరించనున్నారు. ప్రాచీ యాదవ్, వి.నికేషిణి, ఎల్.శ్రుతిక, కె.అనేరా శాంత్, స్రవంతి, నిత్యశ్రీ, నెల్లుట్ల అక్షయ, కొడిగంటి మనీషా, డివిఎన్ఎం శ్రీ రెణ్య, పప్పు కీర్తన, హరిణి ఈ జట్టుకు ఎంపికయ్యారు. ఈ యువ ప్లేయర్లు తమ ప్రతిభతో లీగ్‌లో సత్తా చాటేందుకు సిద్ధమవుతున్నారు.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..