Harish Rao: 100 రోజులు కాలేదని ఆగుతున్నాం.. లేకపోతే చీల్చి చెండాడే వాళ్లం.. హరీష్ రావు సంచలన వ్యాఖ్యలు..

|

Jan 17, 2024 | 3:08 PM

లోక్‌సభ ఎన్నికలపై బీఆర్‌ఎస్‌ దృష్టిసారించింది. దీనిలో భాగంగా పార్లమెంట్ స్థానాల వారీగా సన్నాహాక సమావేశాలను నిర్వహిస్తోంది. ఈ క్రమంలో తెలంగాణ భవన్‌లో నాగర్‌కర్నూల్‌ సెగ్మెంట్‌ నేతలతో హరీష్‌రావు కీలక సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి హరీష్ రావు సంచలన వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ నేతలు కర్నాటకలో చేతులెత్తేశారు.. తెలంగాణలోనూ గ్యారంటీలను ఎత్తేస్తారు.. అంటూ పేర్కొన్నారు.

Harish Rao: 100 రోజులు కాలేదని ఆగుతున్నాం.. లేకపోతే చీల్చి చెండాడే వాళ్లం.. హరీష్ రావు సంచలన వ్యాఖ్యలు..
Harish Rao
Follow us on

లోక్‌సభ ఎన్నికలపై బీఆర్‌ఎస్‌ దృష్టిసారించింది. దీనిలో భాగంగా పార్లమెంట్ స్థానాల వారీగా సన్నాహాక సమావేశాలను నిర్వహిస్తోంది. ఈ క్రమంలో తెలంగాణ భవన్‌లో నాగర్‌కర్నూల్‌ సెగ్మెంట్‌ నేతలతో హరీష్‌రావు కీలక సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి హరీష్ రావు సంచలన వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ నేతలు కర్నాటకలో చేతులెత్తేశారు.. తెలంగాణలోనూ గ్యారంటీలను ఎత్తేస్తారు.. అంటూ పేర్కొన్నారు. గ్యారెంటీల అమలు విషయంలో.. ఇంకా 100 రోజులు కాలేదని ఆగుతున్నామని.. లేకపోతే కాంగ్రెస్‌ను చీల్చి చెండాడే వాళ్లమంటూ హరీష్‌ రావు ఘాటు వ్యాఖ్యలు చేశారు. కొన్ని రోజులైతే బీఆర్ఎస్ నేతలు ఇంట్లో కూర్చున్నా.. రండి రండి అని ప్రజలే బయటకు తీసుకువస్తారంటూ పేర్కొన్నారు.. బీఆర్‌ఎస్‌ ఎంపీలు ఢిల్లీలో లేకపోతే తెలంగాణకు నష్టమంటూ వ్యాఖ్యానించారు. విభజన సమస్యలు ఇంకా పరిష్కారం కాలేదని.. పార్లమెంటు ఎన్నికల్లో బీఆర్ఎస్ గెలిస్తేనే తెలంగాణ సమస్యలకి పరిష్కారం లభిస్తుందని హరీష్ రావు అభిప్రాయపడ్డారు. ఈ కీలక సమయంలో బీఆర్ఎస్ ఎంపీలు ఢిల్లీలో ఉండాలన్నారు.

ఈ సోషల్ మీడియా దుష్ప్రచారాల కాలంలో ప్రభుత్వం మారడానికి ప్రజలకు పనికొచ్చే అంశాలు కూడా ఉండనక్కర్లేదంటూ హరీష్ రావు పేర్కొన్నారు. రాజస్థాన్‌లో, ఛత్తీస్‌ఘడ్ లో ఐదేళ్లకే ప్రభుత్వం మారిందని.. ఇట్లా ప్రభుత్వాలు మారడం దేశంలో కొత్తేమి కాదన్నారు. కాంగ్రెస్ పార్టీ రాష్ట్రాల్లో వరసగా పదేళ్లు పాలించిన సందర్భాలు చాలా అరుదన్నారు. ఐదేళ్లలోపే ప్రజావ్యతిరేకతను మూట గట్టుకుని ఇంటికిపోయిన కాంగ్రెస్ ప్రభుత్వాలే ఈ దేశంలో ఎక్కువన్నారు.

అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ ఇచ్చిన హామీలు అమలు కావాలంటే ఏడాదికి మూడున్నర లక్షల కోట్ల రూపాయలు కావాలని.. మన బడ్జెట్ ఎంత..? 2 లక్షల 90 వేల కోట్లు.. అంటూ హరీష్‌రావు గుర్తుచేశారు. గ్యారంటీలు అమలు చేస్తే కర్ణాటక ఆర్థిక వ్యవస్థ కుప్ప కూలుతుందని ఆయన హెచ్చరించారు. సాంప్రదాయ రాజకీయపద్ధతులకు కేసీఆర్ దూరంగా ఉన్నారని.. కొంత అది నష్టం చేసిందన్న భావన కార్యకర్తల్లో ఉందన్నారు.

బండి సంజయ్ కాంగ్రెస్ బీజేపీల మైత్రిని బహిరంగంగా ఒప్పుకున్నారంటూ హరీష్ రావు పేర్కొన్నారు. కేసీఆర్ కాంగ్రెస్ ఎమ్మెల్యేలను కొనేందుకు ప్రయత్నిస్తున్నారన్న బండి సంజయ్‌ వ్యాఖ్యలను తిప్పికొట్టిన హరీష్‌ రావు.. కాంగ్రెస్ ప్రభుత్వాలను కూల్చిన చరిత్ర పలు ప్రాంతీయ పార్టీలను చీల్చిన చరిత్ర బీజేపీదేననన్నారు. బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలను కొనుగోలు చేసేందుకు ప్రయత్నించి కొంతమంది రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడ్డారని పేర్కొన్నారు.

వీడియో చూడండి..

రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై శ్వేత పత్రం ప్రకటించి తమను బద్నామ్ చేసే ప్రయత్నం చేస్తున్నారంటూ హరీష్‌ రావు మండిపడ్డారు. నీతి ఆయోగ్ తాజాగా విడుదల చేసిన నివేదిక లో తెలంగాణ ఆర్థిక ప్రగతిని గొప్పగా పొగిడిందంటూ గుర్తుచేశారు. దేశంలో పేదరికం తక్కువగా ఉన్న రాష్ట్రాల్లో తెలంగాణ మూడో స్థానానికి చేరిందంటే అది కేసీఆర్ ఘనతేనన్నారు. తెలంగాణ కన్నా ముందున్న రాష్ట్రాలు తమిళనాడు కేరళ మాత్రమేనంటూ పేర్కొన్నారు. సంక్షేమంతో పాటు అభివృద్దిని కేసీఆర్ జోడు ఎడ్లలా కొనసాగించడం వల్లే.. గత పదేళ్లలో తెలంగాణ పేదరికం 83 శాతం తగ్గిందన్నారు. నీతి ఆయోగ్ నివేదిక తోనైనా కాంగ్రెస్ నేతలు నిజాలు మాట్లాడటం అలవాటు చేసుకోవాలని సూచించారు.

దావోస్ కు వెళ్లిన సీఎం బృందం రాష్ట్రం అప్పుల్లో ఉంది పెట్టుబడులకు రావొద్దు అని చెప్పదలుచుకుందా..? అంటూ ప్రశ్నించారు.. దావోస్ వెళ్లడం అంటే ఖర్చు దండగ అని ప్రతిపక్షంలో ఉండగా ఉత్తమ్ అన్నారని.. ఇప్పుడేమంటారంటూ కౌంటర్‌ ఇచ్చారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..