సిద్దిపేటలో ఘోరం..నీళ్లు కావాలి అని నమ్మించి.. వృద్ధురాలిపై కత్తితో బెదిరింపు..!

ఒంటరిగా ఉండే వృద్ధులను లక్ష్యంగా చేసుకుని దొంగలు కొత్త కొత్త పద్ధతుల్లో నేరాలకు పాల్పడుతున్నారు. అమాయకంగా మాట్లాడి నమ్మించడం, ఆపై మానవత్వంతో సహాయం చేయడానికి వచ్చే వృద్ధులపై దాడులు చేసి దోచుకోవడం తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. తాజాగా సిద్దిపేట పట్టణంలో ఇటువంటి ఘోరమైన సంఘటన వెలుగు చూసింది. నీళ్లు అడిగిన మిషతో ఇంట్లోకి చొరబడిన ఒక దుండగుడు, ఎదురుతిరిగిన వృద్ధురాలిని కత్తితో ప్రాణాలు తీస్తామని బెదిరించి ఆరు తులాల బంగారు పుస్తెలతాడును దోచుకెళ్లాడు.

సిద్దిపేటలో ఘోరం..నీళ్లు కావాలి అని నమ్మించి.. వృద్ధురాలిపై కత్తితో బెదిరింపు..!
Siddipet Robbery

Edited By:

Updated on: Nov 05, 2026 | 4:30 PM

ఒంటరిగా ఉండే వృద్ధులే లక్ష్యంగా దొంగలు సరికొత్త పంథాలో రెచ్చిపోతున్నారు. నమ్మించి మోసం చేయడం ఒకవైపితే, ఎదురుతిరిగిన వృద్ధురాలిని ప్రాణాలతో చంపేస్తామని కత్తితో బెదిరించి ఆరు తులాల బంగారాన్ని దోచుకెళ్లాడు ఒక దుండగుడు.. పోలీసులు, బాధితుల కథనం ప్రకారం.. సిద్దిపేట పట్టణంలోని పాత చేపల మార్కెట్ ప్రాంతానికి చెందిన కళ్ళకుంట్ల పెంటమ్మ అనే వృద్ధురాలు బుధవారం సాయంత్రం ఇంట్లో ఒంటరిగా ఉన్నారు.

ఆ సమయంలో ముఖానికి మాస్క్ ధరించిన ఒక గుర్తుతెలియని వ్యక్తి ఆమె ఇంటి వద్దకు వచ్చాడు..మీ అబ్బాయి ఉన్నాడా? కొంచెం పని ఉంది అంటూ చాలా మర్యాదగా మాటలు కలిపాడు. ఇంట్లో ఎవరూ లేరని, బయటకు వెళ్లారని పెంటమ్మ అమాయకంగా సమాధానం ఇచ్చింది..ఇంట్లో వృద్ధురాలు ఒంటరిగా ఉందనే విషయాన్ని నిర్ధారించుకున్న ఆ దుండగుడు తన అసలు ప్లాన్ అమలు చేశాడు..

అమ్మా.. చాలా దాహంగా ఉంది, కొంచెం మంచి నీళ్లు ఇస్తారా? అని అడిగాడు. మానవత్వంతో పెంటమ్మ లోపలికి వెళ్లి నీళ్లు తెచ్చి ఇచ్చింది. అంతటితో ఆగని ఆ కిరాతకుడు, మరోసారి నీళ్లు కావాలని కోరాడు. ఆమె మళ్లీ నీళ్ల కోసం లోపలికి వెళ్లే లోపు.. వెనుక నుంచి బలవంతంగా ఇంట్లోకి చొరబడ్డాడు..ఇంట్లోకి ప్రవేశించిన వెంటనే ఆ వ్యక్తి పెంటమ్మ మెడలో ఉన్న ఆరు తులాల రెండు వరుసల బంగారు పుస్తెలతాడును బలంగా లాగాడు.

ఇవి కూడా చదవండి

అయితే, ఊహించని ఈ ప్రమాదం నుంచి తేరుకున్న పెంటమ్మ ధైర్యంగా దొంగను నిలదీసింది. తన పుస్తెలతాడును దక్కించుకోవ డానికి అతనితో గట్టిగా పెనుగులాడింది. వృద్ధురాలు గట్టిగా అరిస్తే చుట్టుపక్కల వారు వస్తారనే భయంతో దుండగుడు..నా జేబులో కత్తి ఉంది.. గట్టిగా అరిచావో ప్రాణాలు తీసేస్తా అంటూ తీవ్రంగా బెదిరించాడు.

ఆపై పెంటమ్మను ఇంట్లోనే బంధించి, బయట నుంచి తలుపునకు గొళ్లెం పెట్టి క్షణాల్లో అక్కడ నుంచి పరారయ్యాడు. కాసేపటికి తేరుకున్న వృద్ధురాలు ఇంటి వెనుక తలుపు ద్వారా ఎలాగోలా బయటకు వచ్చి, ఇరుగుపొరుగు వారికి జరిగిందంతా వివరించింది.

బాధితురాలి ఫిర్యాదు మేరకు సిద్దిపేట వన్ టౌన్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.నిందితుడిని పట్టుకునేందుకు పోలీసులు ప్రత్యేక బృందాలను రంగంలోకి దించారు. స్థానిక పాత చేపల మార్కెట్ పరిసర ప్రాంతాల్లో ఉన్న సీసీటీవీ (CCTV) కెమెరాల ఫుటేజీలను పోలీసులు జల్లెడ పడుతున్నారు. మాస్క్ ధరించిన ఆ వ్యక్తి కదలికలను గుర్తించేందుకు సాంకేతిక ఆధారాలను సేకరిస్తున్నారు.

మరిన్ని తెలంగాణ న్యూస్ కోసం క్లిక్ చేయండి..

Loading...
Unable to load recommendations.
Follow Us