
తెలంగాణలోని కరీంనగర్ లోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో ఈ అరుదైన సంఘటన జరిగింది. శనివారం రోజున ఓ మహిళ నలుగురు పిల్లలకు జన్మనిచ్చింది. ప్రస్తుతం తల్లీబిడ్డలు క్షేమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు.

ఈ కాన్పు పట్ల కుటుంబ సభ్యులతో పాటు.. ఆసుపత్రి సిబ్బంది సంతోషం వ్యక్తం చేశారు.

కరీంనగర్ జిల్లాలోని నాగుల మాల్యల కు చెందిన నిఖిత నలుగురు శిశివులకు జన్మనిచ్చింది. తమకు నలుగురు పిల్లలు జన్మించడం చాలా సంతోషంగా ఉందని సాయి కిరణ్ నిఖిత దంపతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

పుట్టిన పిల్లలు సంపూర్ణ ఆరోగ్యంతో జన్మించడంతో తల్లిదండ్రులు ఆనందాన్ని వ్యక్తం చేశారు. కాగా ప్రతి 7 లక్షల మంది ప్రసవాలలో ఒక ప్రసవంలో నలుగురు పిల్లలు పుడుతుంటారని వైద్యులు తెలిపారు.