Tragedy: బీహార్‌లో నలుగురు తెలంగాణ యువకుల మృతి.. మిస్టరీగా మారిన ఘటన

|

Jan 12, 2022 | 8:53 AM

Four Telangana youths killed in Bihar: వారంతా స్నేహితులు.. హైదరాబాద్‌లో పని చేసుకుంటామని చెప్పి ఇంట్లో నుంచి వెళ్లారు. ఆ తర్వాత బీహార్‌లో

Tragedy: బీహార్‌లో నలుగురు తెలంగాణ యువకుల మృతి.. మిస్టరీగా మారిన ఘటన
Follow us on

Four Telangana youths killed in Bihar: వారంతా స్నేహితులు.. హైదరాబాద్‌లో పని చేసుకుంటామని చెప్పి ఇంట్లో నుంచి వెళ్లారు. ఆ తర్వాత బీహార్‌లో ప్రాణాలు వదిలారు. అసలు హైదరాబాద్ నుంచి బీహార్ ఎందుకు వెళ్లారు.. ఎలా చనిపోయారనేది ప్రస్తుతం మిస్టరీగా మారింది. తెలంగాణలోని మహబూబ్‌నగర్‌ ఉమ్మడి జిల్లాకు చెందిన యువకులు బీహార్‌లో మృతి చెందిన సంఘటన రాష్ట్రంలో కలకలం రేపింది. ఈ వార్త తెలుసుకున్న ఆయా కుటుంబాలు కన్నీరుమున్నీరవుతున్నాయి. మహబూబ్‌నగర్‌ జిల్లా భూత్పూరు మునిసిపాలిటీ పరిధిలోని పలు తండాలకు చెందిన కేతావత్‌ వెంకటేశ్‌ (25), పాల్త్యావత్‌ వినోద్‌ (23), శ్రీను (23), సంతోష్‌ (24) స్నేహితులు. వీరు బీమా సంస్థల్లో ఉద్యోగం చేసేందుకని వెళ్తున్నామని చెప్పి ఇటీవల హైదరాబాద్‌‌కు వెళ్లారు. ఈ క్రమంలో రెండు వారాల క్రితం ఇంటికి వచ్చి.. గతవారం మళ్లీ వెళ్లారు.

అయితే.. వారిలో వెంకటేశ్‌, వినోద్‌, శ్రీను, సంతోష్ బీహార్‌లోని పాట్నాలో ఆదివారం మృతి చెందినట్లు వారి కుటుంబసభ్యులకు మంగళవారం ఫోన్ వచ్చింది. కల్తీ మద్యం తాగడం వల్లే ముగ్గురు చనిపోయారని సమాచారమిచ్చారు. అయితే.. కొత్తపల్లి తండాకు చెందిన అవినాష్‌ (26) రైలులో మృతి చెందినట్లు అతని సోదరుడు భాస్కర్‌కు సోమవారం అర్ధరాత్రి ఫోన్ వచ్చింది. ఉత్తర్‌ప్రదేశ్‌లో కానిస్టేబుల్‌ నుంచి ఫోన్‌ వచ్చినట్లు పేర్కొన్నారు. కాగా.. వీరంతా కలిసే బీహార్‌ వెళ్లినట్లు సమాచారం.

ఆర్థిక నేరాలకు చెందిన ముఠా బీమా రంగంలో ఉద్యోగాలు అంటూ వీరిని అక్కడికి తీసుకువెళ్లినట్లు ప్రచారం జరుగుతోంది. సమాచారం అందుకున్న కుటుంబసభ్యులు గుండెలవిసేలా రోదిస్తున్నారు. దీంతో తండాల్లో విషాదం అలుముకుంది. అయితే.. వీరంతా బీహార్ ఎందుకు వెళ్లారు.. అక్కడ ఎలా చనిపోయారనేది మిస్టరీగా మారింది. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Also Read:

Shamshabad: ఎయిర్‌పోర్ట్‌లో భారీగా బంగారం పట్టివేత.. అనుమానం రాకుండా లో దుస్తుల్లో..

Guntur: సాగర్ కాల్వలోకి దూసుకెళ్లిన కారు.. ప్రభుత్వ విప్ పిన్నెల్లి బంధువుల మృతి.. పండక్కి