
ఆసిఫాబాద్, మే 18: వేసవిలో అందరూ ఎంతో ఇష్టంతా తినే మామిడి పండ్లు ఓ బాలుడి నిండు ప్రాణాలు తీశాయి. మామిడి పండ్లను త్వరగా మాగబెట్టడానికి కొందరు వ్యాపారులు కృత్రిమ రసాయాలను విచ్చలవిడిగా వినియోగిస్తున్నారు. ఇలా మాగపెట్టిన మామిడి పండు తిని ఐదేళ్ల బాలుడు మృతి చెందగా.. మరో ఇద్దరు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. ఈ ఘటన తెలంగాణ జిల్లాలోని కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లా దహెగాం మండలంలోని లోహ గ్రామంలో చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం..
బెజ్జూర్ మండలం కుంటమానుపల్లికి చెందిన పోర్తెట్టి శారద, శ్రీనివాస్ దంపతులు పిల్లలతో కలిసి లోహ గ్రామంలో కూలి పనుల కోసం వచ్చారు. శారద శనివారం కేడా గ్రామస్తులతో కలిసి తునికాకు సేకరణకు వెళ్లింది. అదే రోజు సాయంత్రం నాలుగు గంటల ప్రాంతంలో శారద, శ్రీనివాస్ దంపతుల కుమారుడు శ్రీవర్ధన్ (5), కూతురు కీర్తనతోపాటు మరో బాలుడు కీర్తి కుమార్ ఒక్కసారిగా తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. గమనించిన స్థానికులు వీరిని వెంటనే కొంచవెల్లిలోని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. చికిత్స అనంతరం వారి ఆరోగ్యం కుదుటపడటంతో తిరిగి లోహ గ్రామానికి తీసుకొచ్చారు.
అయితే అర్ధరాత్రి మళ్లీ ముగ్గురు చిన్నారులు తీవ్ర అస్వస్థతకు గురయ్యా రు. వారిని ఆస్పత్రికి తరలించే క్రమంలో శ్రీవర్ధన్ ఇంటి వద్దే మృతి చెందాడు. కీర్తన, కీర్తి కుమార్‌ను మంచిర్యాలలోని ప్రభుత్వ దవాఖానలో చేర్పించి చికిత్స అందిస్. పిల్లలు ఉన్నట్లుండి ఇలా విచిత్రంగా అశ్వస్థతకు గురికావడం వెనుక కారణాలు ఇంకా తెలియరాదు. బాదిత కుటుంబం ఇంట్లో క్యా ల్షియం కార్బైడ్‌తో మాగబెట్టిన పండ్లు ఉన్నాయని, ఈ పండ్లను తినడం వల్ల అశ్వస్థతకు గురయ్యాయా? లేదా పిల్లలకు వడదెబ్బ తగలడం వల్ల ఇలా జరిగిందా? అనేది ఇంకా తెలియరాలేదు. కాగ రసాయనాలతో మగబెట్టిన మామిడి పండ్లు పలు ఆరోగ్య సమస్యలను కలిగిస్తాయి. కొన్ని సందర్భాల్లో మరణానికి కూడా దారి తీస్తాయి. గతేడాది కూడా దేశంలో పలు సంఘటనలు చోటు చేసుకున్నాయి.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.