తెలంగాణ భవన్ లో సంబరాలు.. చలువ పందిరికి మంటలు..తృటిలో తప్పిన ప్రమాదం

తెలంగాణ భవన్‌లో అగ్నిప్రమాదం జరిగింది. ఒక్కసారిగా మంటలు వ్యాపించడంతో అక్కడున్న వాళ్లంతా ఉలిక్కిపడ్డారు. వెంటనే సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేయటంతో

తెలంగాణ భవన్ లో సంబరాలు.. చలువ పందిరికి మంటలు..తృటిలో తప్పిన ప్రమాదం
Fire Accident In Telangana Bhavan

Updated on: May 02, 2021 | 2:29 PM

తెలంగాణ భవన్‌లో అగ్నిప్రమాదం జరిగింది. ఒక్కసారిగా మంటలు వ్యాపించడంతో అక్కడున్న వాళ్లంతా ఉలిక్కిపడ్డారు. వెంటనే సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేయటంతో పెను ప్రమాదం తప్పింది.

నాగార్జున సాగర్ ఎన్నికల్లో టీఆర్ఎస్ విజయం ఖాయం కావడంతో తెలంగాణ భవన్ లో ఆనందోత్సాహం నెలకొంది. బాణాసంచా కాల్చడంతో నిప్పు రవ్వ కాస్త తెలంగాణ భవన్‌లో ఉన్న చలువ పందిరి పై పడింది. దీంతో చలువ పందిరికి మంటలు అంటుకున్నాయి. అక్కడున్న వాళ్ళు చూసి వెంటనే అప్రమత్తమై మంటల్ని ఆపేందుకు ప్రయత్నం చేశారు. ఇంతలో సమాచారం అందుకున్న ఫైర్ సిబ్బంది హుటాహుటిన అక్కడకు చేరుకుని మంటలను అదుపులోకి తీసుకువచ్చారు.

నాగార్జునసాగర్ ఉపఎన్నికలో టీఆర్ఎస్ అభ్యర్థి నోముల భగత్ విజయం దిశగా దూసుకెళ్తుండటంతో అటు సాగర్‌తో పాటు ఇటు హైదరాబాద్‌లోనూ కార్యకర్తలు, టీఆర్ఎస్ అభిమానులు, పార్టీ శ్రేణులు సంబరాలు చేసుకుంటున్నారు. తెలంగాణ భవన్‌లోనూ పార్టీ నేతలు, పలువురు ముఖ్య కార్యకర్తలు బాణసంచా కాల్చి సంబరాలు చేసుకున్నారు. అయితే బాణసంచాల మంటల ధాటికి ఒక్కసారిగా పందిరి అంటుకుంది.

Loading...
Unable to load recommendations.
Follow Us