తెలంగాణ సర్కార్‌కు మంచు విష్ణు ఫిదా.. ముఖ్యమంత్రి కేసీఆర్‌పై ట్వీట్టర్ వేదికగా ప్రశంసలు

| Edited By: Team Veegam

Apr 12, 2021 | 8:25 PM

Manchu Vishnu praised CM KCR: సినీ నటుడు, మంచు విష్ణు.. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ను ప్రశంసలతో ముంచెత్తారు. కష్టాల్లో ఉన్న ఉపాధ్యాయులను అక్కున చేర్చుకున్నందుకు కేసీఆర్‌ను అభినందించారు.

తెలంగాణ సర్కార్‌కు మంచు విష్ణు ఫిదా.. ముఖ్యమంత్రి కేసీఆర్‌పై ట్వీట్టర్ వేదికగా ప్రశంసలు
Actor Manchu Vishnu Praised Telangana Cm
Follow us on

Manchu Vishnu praised CM KCR: సినీ నటుడు, మంచు విష్ణు.. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ను ప్రశంసలతో ముంచెత్తారు. కష్టాల్లో ఉన్న ఉపాధ్యాయులను అక్కున చేర్చుకున్నందుకు కేసీఆర్‌ను అభినందించారు. కరోనా కారణంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్న ప్రైవేటు విద్యాసంస్థల ఉపాధ్యాయులను ఆదుకునేందుకు తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం పట్ల మంచు విష్ణు హర్షం వ్యక్తం చేశారు. కేసీఆర్‌ తీసుకున్న నిర్ణయంతో ఉపాధ్యాయులందరూ ఎంతో సంతోషిస్తున్నారని తెలిపారు.

ఈ మేరకు సోమవారం ఉదయం విష్ణు ఓ ట్వీట్‌ వేదికగా వెల్లడించారు. ‘కరోనా నేపథ్యంలో ప్రైవేటు ఉపాధ్యాయులు, సిబ్బందిని ఆదుకోవాలనే ఉద్దేశంతో ప్రతినెలా వాళ్లకి రూ.2,000 నగదు, 25 కిలోల బియ్యాన్ని ఇవ్వాలని నిర్ణయించడం ఓ అద్భుతం. ఈ నిర్ణయంతో విద్యారంగంలో ఉన్న ఎంతో మంది ఉపాధ్యాయులకు మీపై మరెంతో గౌరవం పెరిగింది’ అని విష్ణు పేర్కొన్నారు.


ఇదిలావుంటే, కరోనా దృష్ట్యా విద్యాసంస్థలు మూతపడటంతో ఇబ్బందులు ఎదుర్కొంటున్న గుర్తింపు పొందిన ప్రైవేట్‌ టీచర్లు, సిబ్బందికి ప్రకటించిన ఆర్థిక సాయానికి నిధులు విడుదల చేసింది తెలంగాణ ప్రభుత్వం. ఏప్రిల్‌ నెలలో అందించేందుకు ప్రభుత్వం రూ.32కోట్లు విడుదల చేసింది. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది. కోవిడ్ కారణంగా మూతపడ్డ పాఠశాలలు తిరిగి తెరిచేవరకు ప్రతినెలా ఒక్కొక్కరికి రూ.2వేల ఆర్థిక సాయం, 25 కిలోల బియ్యం అందివ్వాలని ఇటీవల సీఎం కేసీఆర్‌ నిర్ణయించారు.

సీఎం నిర్ణయం నేపథ్యంలో ప్రభుత్వం నిధులు విడుదల చేసింది. దీని ద్వారా దాదాపు లక్షన్నరమంది ప్రైవేట్‌ టీచర్లు, ఇతర సిబ్బందికి లబ్ధి చేకూరనుంది. ప్రైవేట్‌ టీచర్లు, సిబ్బంది తమ ధ్రువీకరణ, బ్యాంకు ఖాతా తదితర వివరాలతో స్థానిక జిల్లా కలెక్టర్లకు దరఖాస్తు చేసుకోవాలని ఇప్పటికే అధికారులు సూచించిన విషయం తెలిసిందే.

Read Also… RR vs PBKS Live Score IPL 2021: మరో ఆసక్తికర పోరుకు రంగం సిద్ధం.. అత్యంత ఖరీదైన ఆటగాడు ఏ మేర రాణిస్తాడో చూడాలి..