అయ్యో దేవుడా.. వర్ష బీభత్సంతో పలువురు మృతి.. కారులో విమానాశ్రయానికి వెళ్తూ తండ్రీకూతురు..

|

Sep 01, 2024 | 11:41 AM

తెలుగు రాష్ట్రాల్లో వర్షబీభత్సం కొనసాగుతోంది. ఏపీ, తెలంగాణలో రెండ్రోజులుగా కుండపోత వర్షాలు కురుస్తున్నాయ్‌. దీంతో రెండు రాష్ట్రాల్లో రెడ్‌ అలర్ట్‌ జారీ చేశారు. రాత్రి నుంచి ఎడతెరపిలేకుండా కురుస్తున్న వర్షాలతో వాగులు వంకలు ఉగ్రరూపం దాల్చాయి. కొన్ని ప్రాంతాల్లో పోటెత్తుతున్న వరదలతో.. గ్రామాల మధ్య రాకపోకలు నిలిచిపోయాయి.

అయ్యో దేవుడా.. వర్ష బీభత్సంతో పలువురు మృతి.. కారులో విమానాశ్రయానికి వెళ్తూ తండ్రీకూతురు..
Floods in Telangana
Follow us on

తెలుగు రాష్ట్రాల్లో వర్షబీభత్సం కొనసాగుతోంది. ఏపీ, తెలంగాణలో రెండ్రోజులుగా కుండపోత వర్షాలు కురుస్తున్నాయ్‌. దీంతో రెండు రాష్ట్రాల్లో రెడ్‌ అలర్ట్‌ జారీ చేశారు. రాత్రి నుంచి ఎడతెరపిలేకుండా కురుస్తున్న వర్షాలతో వాగులు వంకలు ఉగ్రరూపం దాల్చాయి. కొన్ని ప్రాంతాల్లో పోటెత్తుతున్న వరదలతో.. గ్రామాల మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. దీంతో.. జనజీవనం స్తంభించిపోయింది. లోతట్టు ప్రాంతాలు మొత్తం జలదిగ్భందమయ్యాయి. ఎలాంటి ప్రయాణాలైనా వాయిదా వేసుకోవాలని.. ప్రజలు అప్రమత్తంగా ఉండాలంటూ వాతావరణ శాఖ రెడ్‌ అలర్ట్‌ జారీ చేసింది. అయితే.. పలు చోట్ల వరదలు ప్రాణాలు తీశాయి.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలతో పలువురు మరణించగా.. పలువురు వరదల్లో గల్లంతయ్యారు.

ఇల్లు కూలి తల్లి కూతుళ్లు మృతి..

నారాయణపేట జిల్లా మద్దూరు మండలం ఎక్కమేడు గ్రామంలో ఇల్లు కూలి తల్లి, కూతురు ఇద్దరు మృతిచెందారు. రెండు రోజుల నుండి కురుస్తున్న వర్షంతో శనివారం రాత్రి ఇల్లు కూలింది.. నిద్రిస్తున్న సమయంలో ఇల్లు కూలడంతో తల్లి, కూతురు మృతిచెందారు.

కారులో డెడ్ బాడీ..

కోదాడలో పోలీసులు ఒక డెడ్‌బాడీని గుర్తించారు. కోదాడలో నిన్న రాత్రి వర్షానికి రెండు కార్లు కొట్టుకుపోయాయి. ఆ రెండుకార్లను పోలీసులు వెలికితీశారు. కారులో వ్యక్తి మృతదేహాన్ని పోలీసులు బయటకు తీశారు.

గల్లంతైన మహిళ మృత దేహం లభ్యం

ఖమ్మం జిల్లా మధిర మండలం దెందుకూరులో నిన్న గేదెలు కాయటానికి వెళ్లి  గల్లంతైన నన్నే బోయిన పద్మావతి (34) అనే మహిళ మృతిచెందింది.. ఆదివారం ఉదయం మృత దేహం లభ్యమైంది. ఆమె వరదలకు కొట్టుకుపోయినట్లు స్థానికులు తెలిపారు.

వరదప్రవాహంలో కొట్టుకుపోయిన కారు.. పాపం తండ్రీకూతరు..

మరిపెడ మండలం పురుషోత్తమాయగూడెం వద్ద బ్రిడ్జిపై నుంచి వరదనీరు ప్రవహిస్తోంది.. ఈ సమయంలో కారులో హైదరాబాద్ విమానాశ్రయానికి బయలుదేరిన ఖమ్మం జిల్లా సింగరేణి మండలం గేట్ కారేపల్లి గంగారం తండాకు చెందిన తండ్రి, కూతురు .. వరద ప్రవాహంలో గల్లంతయ్యారు.. పురుషోత్తమాయగూడెం ఆకేరు వాగు ఉదృతంగా ప్రవహిస్తుండడంతో అదుపుతప్పి నీటిలోకి కారు కొట్టుకుపోయింది.. అయితే.. తమ కారు వాగులోకి పోయిందని, తమ మెడవరకు నీరు వచ్చిందంటూ బందువులకు నూనావత్ మోతిలాల్, నూనావత్ అశ్విని ఫొన్ చేశారు. ప్రస్తుతం వారి ఫోన్ లు స్విచ్చాఫ్ రావడం, కారు కూడా కనిపించకపోవడంతో కుటుంబసభ్యులు, బంధువులు ఆందోళన చెందతున్నారు. పోలీసులు ఆచూకీ కోసం గాలిస్తున్నారు.

భారీ వర్షాలు, వరదల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ప్రభుత్వం అలర్ట్ జారీ చేసింది..

ఖమ్మం జిల్లా: కలకోట వద్ద వైరా నది ప్రవాహం.. వీడియో చూడండి..

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..