
ఆ కుటుంబంలో పంచాయతీ ఎన్నికల్లో గెలిచిన సంతోషం లేకుండానే విషాదం చోటుచేసుకుంది. కుమారుడు మరణించిన కొద్ది గంటల్లోనే ఆ తండ్రి కూడా అకస్మాత్తుగా తనువు చాలించాడు. హృదయాలను కలిసి వేసిన ఘటన ఎక్కడ జరిగిందో తెలుసుకోవాలంటే ఈ స్టోరీ చదవాల్సిందే..!
యాదాద్రి జిల్లా రాజాపేట మండలం నెమిల గ్రామానికి చెందిన మోత్కుపల్లి ఐలయ్యకు భార్య, ఇద్దరు కుమారులు, ఒక్క కుమార్తె ఉన్నారు. ఐలయ్య చిన్న కుమారుడు బాలకృష్ణ కొంతకాలంగా కిడ్నీ వ్యాధితో అనారోగ్యం బారిన పడుతున్నాడు. అయితే ఇటీవల జరిగిన గ్రామ పంచాయతీ ఎన్నికల్లో బాలకృష్ణ భార్య జ్యోతిని వార్డు ఎన్నికల్లో పోటీ చేయించాడు ఐలయ్య. అందరూ ఊహించినట్లే జ్యోతి వార్డు సభ్యురాలిగా విజయం సాధించింది. ఆ కుటుంబంలో జ్యోతి గెలుపు సంబరాలను తెచ్చిపెట్టింది.
ఇదే సమయంలో బాలకృష్ణ తీవ్ర అనారోగ్యానికి గురికావడంతో కుటుంబ సభ్యులు హైదరాబాద్ ప్రైవేట్ ఆస్పత్రిలో చేర్పించారు. చికిత్స పొందుతున్న బాలకృష్ణ పరిస్థితి విషమించి మృతి చెందడంతో ఇంటికి మృతదేహాన్ని తీసుకువచ్చారు. కుమారుడి మృతితో తండ్రి ఐలయ్య కన్నీరు మున్నీరయ్యారు. కొడుకు మృతిని తట్టుకోలేక ఐలయ్య అకస్మాత్తుగా కుప్పకూలిపోయాడు. వెంటనే హైదరాబాద్ లోని ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా మారడంతో ఐలయ్య గుండెపోటుతో చనిపోయాడు.
తల్లీకొడుకులు ఒకేసారి మృతి చెందడంతో ఆ కుటుంబం తీవ్ర శోకసంద్రంలో మునిగిపోయింది. తండ్రి, కొడుకు అంత్యక్రియలను ఒకే రోజు పూర్తిచేశారు. రెండు రోజుల్లోనే తండ్రి కొడుకులు మృతి చెందడంతో గ్రామంలో విషాదఛాయలు అమ్ముకున్నాయి. వార్డు సభ్యురాలుగా జ్యోతి గెలుపు కుటుంబంలో సంతోషాలను పంచుకోకుండానే భర్త, మామ చనిపోవడంతో జ్యోతి కన్నీరు మున్నీరుగా వినిపిస్తున్నారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..