Crime News: పెళ్లి చేసుకుంటానన్న తనయుడు.. ఆగ్రహించిన తండ్రి.. ఇంట్లోంచి గొడ్డలి తీసుకొచ్చి…

Crime News: తెలంగాణ రాష్ట్రంలోని రంగారెడ్డి జిల్లా కొత్తూరు మండలం చేగూరులో దారుణం ఘటన వెలుగు చూసింది. పెళ్లి చేసుకుంటానని..

Crime News: పెళ్లి చేసుకుంటానన్న తనయుడు.. ఆగ్రహించిన తండ్రి.. ఇంట్లోంచి గొడ్డలి తీసుకొచ్చి...

Updated on: Jan 17, 2021 | 4:55 PM

Crime News: తెలంగాణ రాష్ట్రంలోని రంగారెడ్డి జిల్లా కొత్తూరు మండలం చేగూరులో దారుణం ఘటన వెలుగు చూసింది. పెళ్లి చేసుకుంటానని అన్నందకు ఆగ్రహానికి గురైన తండ్రి గొడ్డలితో దాడి చేశాడు. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన కొడుకు.. ప్రాణాలు వొదిలాడు. ఈ విషాద ఘటనకు సంబంధించి పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. చేగూరు గ్రామానికి చెందిన ఎల్లయ్యకు నరేశ్ అనే కొడుకు ఉన్నాడు. నరేశ్‌కు వివాహం చేసుకునే వయసు వచ్చింది. దాంతో తనకు పెళ్లి చేయాలంటూ పలుమార్లు తన తండ్రితో వాదించాడు నరేశ్. ఇదే అంశంపై తాజాగా కూడా తండ్రీ కొడుకుల మధ్య వాగ్వాదం జరిగింది.

అయితే, అప్పటికే మద్యం మత్తులో ఉన్న తండ్రి ఎల్లయ్యకు.. కొడుకు ప్రతిపాదన తీవ్ర ఆగ్రహాన్ని తెప్పించింది. ఇంట్లో ఉన్న గొడ్డలితో నరేశ్‌పై దాడి చేశాడు. ఆ దాడిలో నరేశ్‌కు తీవ్ర గాయాలవడంతో అక్కడే కుప్పకూలిపోయాడు. ఇది గమనించిన స్థానికులు నరేశ్‌ను ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. అయితే అప్పటికే తీవ్ర రక్తంస్త్రావం అవగా.. చికిత్స పొందుతూ నరేశ్ తుదిశ్వాస విడిచాడు. ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు.. నిందితుడు ఎల్లయ్యను అదుపులోకి తీసుకున్నారు. అతనిపై కేసు నమోదు చేసి రిమాండ్‌కు తరలించారు.

Also read:

Bowenpally Kidnap Case: బోయిన్‌పల్లి కిడ్నాప్‌ కేసులో పురోగతి.. కీలక విషయాలు వెల్లడించిన సీపీ అంజనీ కుమార్, డీసీపీ కలమేశ్వర్..

Allu Arjun’s ‘Pushpa’: నో పార్టీస్.. నో ఫెస్టివల్స్.. మారేడుమిల్లిలో తెగ కష్టపడుతోన్న బన్నీ