Graduates MLC Elections: టీవీ9 పేరుతో కోదండరాంపై తప్పుడు ప్రచారం.. ఫేక్‌గాళ్ల తప్పుడు ప్రచారాన్ని ఎవరూ నమ్మొద్దు..

Graduates MLC Elections: తెలంగాణలో ఎమ్మెల్సీ ఎన్నికల వేళ ఫేక్‌ రాయుళ్లు మరోసారి రెచ్చిపోయారు. టీవీ9 పేరుతో బ్రేకింగ్ న్యూస్ మార్ఫింగ్ చేసి అసత్యప్రచారాలకు..

Graduates MLC Elections: టీవీ9 పేరుతో కోదండరాంపై తప్పుడు ప్రచారం.. ఫేక్‌గాళ్ల తప్పుడు ప్రచారాన్ని ఎవరూ నమ్మొద్దు..
Fake News

Updated on: Mar 14, 2021 | 9:37 AM

Graduates MLC Elections: తెలంగాణలో ఎమ్మెల్సీ ఎన్నికల వేళ ఫేక్‌ రాయుళ్లు మరోసారి రెచ్చిపోయారు. టీవీ9 పేరుతో బ్రేకింగ్ న్యూస్ మార్ఫింగ్ చేసి అసత్యప్రచారాలకు తెరలేపారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేస్తున్న ప్రధాన అభ్యర్థి కోదండరాం త్వరలో టీఆర్ఎస్ పార్టీలో చేరుతున్నట్లు టీవీ9 పేరిట తప్పుడు ప్రచారం చేయడం ప్రారంభించారు. కోదండరాం కేసీఆర్ ఫాంహౌస్‌కు వెళ్లారని, టీఆర్ఎస్‌లో చేరిక అంశంపై చర్చించినట్లుగా బ్రేకింగ్ ప్లేట్స్‌తో తప్పుడు వీడియో సృష్టించి సోషల్ మీడియాలో ప్రచారం చేస్తున్నారు. ఎమ్మెల్సీ నోటిఫికేషన్ నుంచి కేటీఆర్‌ టచ్‌లో‌గా ఉన్నారంటూ ఉద్యమ సమయంలో వారిద్దరూ కలిసి ఉన్న ఫోటోలను ఉపయోగించి వీడియో క్రియేట్ చేశారు ఫేక్ రాయుళ్లు. కాగా, ఈ ఫేక్ ప్రచారం ఎమ్మెల్సీ అభ్యర్థి కోదండరాం స్పందించారు. ఆ ప్రచారంలో ఎలాంటి వాస్తవం లేదని తేల్చి చెప్పారు. గెలుపు తనదని గుర్తించే ప్రత్యర్థి పార్టీల వారు ఇలా తప్పుడు ప్రచారానికి తెరలేపారని ఆరోపించారు.

ఇదిలాఉంటే.. ఈ ఫేక్ ప్రచారానికి సంబంధించిన వీడియో చివరికి టీవీ9 కంట పడటంతో వెంటనే అలర్ట్ అయ్యింది. కోదండరాంపై టీవీ9 ఎలాంటి ప్రచారాలు చేయలేదని స్పష్టం చేసింది. ఫేక్ వీడియోకు, తమ లోగోకు ఎలాంటి సంబంధం లేదని తేల్చి చెప్పింది. దీనిపై ఇప్పటికే లీగల్ యాక్షన్స్ తీసుకోవడం ప్రారంభించింది. టీవీ9 పేరిట తప్పుడు ప్రచారం చేసే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని పోలీసులకు ఫిర్యాదు చేయడం జరిగింది. టీవీ9 కంప్లయింట్ ఆధారంగా కేసు నమోదు చేసిన పోలీసులు.. ఫేక్ వీడియో ప్రచారం చేస్తున్న వారిని గుర్తించేందుకు చర్యలు చేపట్టారు.

తెలుగునాట నెంబర్ 1 ఛానెల్‌గా వెలుగొందుతున్న టీవీ9 లోగోతో అయితే తమ పని సులువు అవుతుందని భావించిన ఫేక్ గాళ్లు గత కొంతకాలంగా టీవీ9 పేరుతో ఫేక్ వార్తలు ప్రచారం చేస్తున్నారు. గతంలో దుబ్బాక ఎన్నికల సమయంలోనూ కాంగ్రెస్ అభ్యర్థి టీఆర్ఎస్‌లో చేరబోతున్నారంటూ తప్పుడు ప్రచారం చేశారు. ఇప్పుడు మళ్లీ కోదండరాం టీఆర్ఎస్‌లో చేరుతున్నట్లుగా తప్పుడు ప్రచారం చేస్తున్నారు. టీవీ9 పేరుతో ఫేక్ గాళ్లు సాగించే ఈ తప్పుడు ప్రచారాన్ని టీవీ9 సీరియస్‌గా తీసుకుంది. ఫేక్ గాళ్లపై పోలీసులు కఠిన చర్యలు తీసుకోవాలని కోరింది.

Also read:

AP Municipal Elections 2021 Results: అనంతపురం తాడిపత్రిలో ఉద్రిక్తత.. వైసీపీ, టీడీపీ కార్యకర్తల మధ్య ఘర్షణ..

AP Municipal Elections 2021 Results: తొలి ఫలితం వచ్చేసింది.. కనిగిరి ఆరో వార్డులో వైసీపీ గెలుపు..