
నల్లగొండ జిల్లా నాంపల్లి మండలం కేతేపల్లికి నగేష్ యాదవ్ కు మర్రిగూడ మండలం సరంపేటకు చెందిన మమతతో ఎనిమిదేళ్ల క్రితం వివాహమైంది. వీరికి ఇద్దరు మగ పిల్లలు ఉన్నారు. నగేష్ కు ఇదే గ్రామానికి చెందిన సుజాత అనే మహిళతో పెళ్లికి ముందు నుండి వివాహేతర సంబంధం కొనసాగుతోంది. సుజాతతో ఉన్న వివాహేతర సంబంధం నగేష్ కుటుంబంలో తెలిసి గొడవలు కూడా అయ్యాయి. ఇద్దరిని బంధువులు, గ్రామ పెద్దలు హెచ్చరించారు. దీంతో నగేష్, సుజాతల మధ్య దూరం పెరిగింది. దీంతో నగేష్‌ను దక్కించుకోవాలన్న అక్కసుతో మమత అడ్డు తొలగించుకోవాలని పెద్ద స్కెచ్ వేసింది.
ప్రియుడిని దక్కించుకునేందుకు నగేష్ భార్యను అంతమొందించాలని సుజాత పథకం వేసింది. ఇందులో భాగంగా శనివారం (జనవరి 31) తన ఇంటి నుండి ఓ సంచిలో పెట్రోల్ బాటిల్, కత్తి, కారం పొడి తీసుకుని నగేష్ ఇంటికి సుతాత వెళ్ళింది. ఆ సమయంలో ఇంటిముందు కూర్చొని తన ఆరు నెలల బాబుకు నగేష్ భార్య మమత పాలిస్తోంది. వెనుక నుండి వెళ్లి మమతపై పెట్రోల్ పోసి నిప్పంటించింది సుజాత. ఒక్కసారిగా ఈ ఘటనతో మమత కేకలు వేసింది. తన ఒడిలో ఉన్న కొడుకును దూరంగా విసిరేసింది.
కానీ మంటలు శరీరమంతా తీవ్రంగా వ్యాపించడంతో శరీరం కాలిపోయి అక్కడికక్కడే మమత మృతి చెందింది. చిన్నారికి తీవ్రగాయాలు, ఆస్పత్రికి తరలించారు. చిన్నారి ఆసుపత్రిలో చికిత్ప పొందుతూ ప్రాణాలు విడిచింది. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని క్లూస్ టీం తో ఆధారాలు సేకరించారు. మమత కుటుంబ సభ్యులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటనలో భర్త నగేష్ ప్రమేయం లేకుండా సుజాత.. ఈ దారుణానికి వడిగట్టి ఉండేది కాదని మమత బంధువులు ఆరోపిస్తున్నారు. మరోవైపు మమత మృతికి కారణమైన సుజాతపై కఠిన చర్యలు తీసుకోవాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.
మరిన్ని క్రైమ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..