Telangana: చెన్నూరులో ఉద్రిక్తత.. అధికారులపై కారంపొడి, పెట్రోల్‌తో ఆక్రమణదారుల దాడి

చెన్నూరులో దేవాదాయ శాఖ భూముల కబ్జా వ్యవహారం తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. ఆక్రమణకు గురైన ప్రభుత్వ భూమిని స్వాధీనం చేసుకోవడానికి వెళ్లిన అధికారులపై కబ్జాదారులు అత్యంత ఘోరంగా కారంపొడి, పెట్రోల్‌తో దాడికి తెగబడ్డారు. ప్రాణభయంతో అధికారులు పరుగులు తీసిన ఈ ఘటన స్థానికంగా సంచలనంగా మారింది.

Telangana: చెన్నూరులో ఉద్రిక్తత.. అధికారులపై కారంపొడి, పెట్రోల్‌తో ఆక్రమణదారుల దాడి
Government Officials Attacked In Chennur

Updated on: Jul 18, 2026 | 2:52 PM

మంచిర్యాల జిల్లా చెన్నూరులో దేవాదాయ శాఖ భూముల కబ్జా వ్యవహారం తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. ఆక్రమణకు గురైన ప్రభుత్వ భూమిని స్వాధీనం చేసుకోవడానికి వెళ్లిన అధికారులపై కబ్జాదారులు  కారంపొడి, పెట్రోల్‌తో దాడికి తెగబడ్డారు. ప్రాణభయంతో అధికారులు పరుగులు తీసిన ఈ ఘటన స్థానికంగా సంచలనంగా మారింది. చెన్నూరు మున్సిపాలిటి జాతీయ రహదారి సమీపంలో దేవాదాయ శాఖకు సంబంధించిన భూమిని కొంతమంది కబ్జా చేశారు.  ఈ భూములను తిరిగి ప్రభుత్వ స్వాధీనంలోకి తీసుకోవాలని ఉన్నతాధికారుల నుంచి ఆదేశాలు రావడంతో దేవాదాయ శాఖ అధికారులు శనివారం క్షేత్రస్థాయికి చేరుకున్నారు. ఆక్రమణలను తొలగించి, భూమిని స్వాధీనం చేసుకునే ప్రక్రియను ప్రారంభించారు. ఈ క్రమంలో కబ్జాదారులు అధికారులపై కారంపొడి, పెట్రోల్‌తో దాడికి తెగబడ్డారు.

కబ్జాదారులు ఒక్కసారిగా ఊహించని విధంగా పెట్రోల్, కారంపొడితో దాడికి తెగబడటంతో అధికారులు షాక్ అయ్యారు. వెంటనే తేరుకుని ప్రాణభయంతో అక్కడినుంచి పరుగులు తీశారు. ఈ దాడిలో కొందరు అధికారులకు స్వల్ప గాయాలైనట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని ఆందోళనకారులను అడ్డుకున్నారు. ప్రభుత్వ అధికారులపై దాడికి పాల్పడి, విధులకు ఆటంకం కలిగించిన కబ్జాదారులపై కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నారు. ఈ ఉద్రిక్తత నేపథ్యంలో చెన్నూరులో అదనపు బలగాలను మోహరించారు.

వీడియో చూడండి..

Follow Us