Local Body Elections: తెలంగాణలో మోగిన పంచాయితీ ఎన్నికల నగారా.. మూడు విడతల్లో ఎన్నికలు

TG Local Bodies Elections: తెలంగాణలో పంఛాయతీ ఎన్నికలకు నగారా మోగింది.. తెలంగాణ పంచాయతీ ఎన్నికల షెడ్యూన్‌ను రాష్ట్ర ఎన్నికల కమిషన్ ప్రకటించింది. రాష్ట్రవ్యాప్తంగా డిసెంబర్ 11, 14, 17 తేదీల్లో మూడు విడతల్లో ఈ పంచాయితీ ఎన్నికలు జరగనున్నాయి. మరోవైపు ఎన్నికల నిర్వహణకు ప్రభుత్వం అనుమతినివ్వగా.. పంచాయతీరాజ్‌శాఖ, ఎన్నికల సంఘం ఏర్పాట్లు చేపట్టాయి.

Local Body Elections: తెలంగాణలో మోగిన పంచాయితీ ఎన్నికల నగారా.. మూడు విడతల్లో ఎన్నికలు
Local Body Elections 2025

Edited By: Janardhan Veluru

Updated on: Nov 25, 2025 | 6:40 PM

తెలంగాణలో పంఛాయతీ ఎన్నికలకు నగారా మోగింది.. తెలంగాణ పంచాయతీ ఎన్నికల షెడ్యూన్‌ను ఎన్నికల కమిషన్ ప్రకటించింది. ఇప్పటికే రిజర్వేషన్లకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం ఈసీకి పూర్తి వివరాలు ఇవ్వడంతో.. ఎన్నికల నిర్వహణకు సంబంధించిన షెడ్యూల్‌ను ఈసీ విడుదల చేసింది.రాష్ట్రవ్యాప్తంగా డిసెంబర్ 11,14, 17 తేదీల్లో మూడు విడతల్లో ఈ ఎన్నికలు నిర్వహించనుండగా.. ప్రతి ఫేజ్‌కి నడుమ రెండు రోజుల వ్యవధి ఉంటుంది. ఈ రోజు నుంచే ఎన్నికల కోడ్ అమలులోకి వస్తుందని ఎన్నికల కమిషనర్ రాణి కుముదుని ప్రకటించారు.

మొదటి విడత పంచాయితీ ఎన్నికలకు సంబంధించి నవంబర్ 27 నుంచి నామినేషన్లు స్వీకరించనున్నారు. రెండో విడతకు నవంబర్ 30న, మూడో విడతకు డిసెంబర్ 3న నుంచి నామినేషన్లు స్వీకరించారు. పోలింగ్ జరిగిన రోజు మధ్యాహ్నం 2 గంటల తర్వాత ఓట్ల లెక్కింపు చేపట్టనున్నారు.

మూడు విడతల్లో తెలంగాణ పంచాయతీ ఎన్నికలు

ఫేజ్ 1 : నవంబర్ 27 నుండి నామినేషన్ స్వీకరణ.. డిసెంబర్ 11 న పోలింగ్

ఫేజ్2: నవంబర్ 30 నుండి నామినేషన్ స్వీకరణ.. డిసెంబర్ 14 న పోలింగ్

ఫేజ్ 3: డిసెంబరు 3 నుండి నామినేషన్ స్వీకరణ.. డిసెంబర్ 17 పోలింగ్.

మూడు విడతల్లో తెలంగాణలో పంచాయితీ ఎన్నికలు.. పూర్తి వివరాలు

తెలంగాణ రాష్ట్రంలోని 31 జిల్లాల్లోని 545 గ్రామీణ మండలాల్లోని 12,760 పంచాయతీలు, 1,13,534 వార్డుల్లో ఎన్నికలు జరగనున్నాయి.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.