ప్రతి సంవత్సరం భారతదేశంలో ఎక్కడో ఒకచోట ఎన్నికలు జరుగుతాయి. ఎన్నికల్లో ఓటరు గుర్తింపు కార్డు తప్పనిసరి. ఎన్నికల తేదీ దగ్గర పడ్డాక దరఖాస్తు చేసుకోవాలని చాలాసార్లు అనుకుంటారు. ఎన్నికల సమయంలో ప్రజలు ఓటరు గుర్తింపు కార్డుల కోసం తరచూ ప్రభుత్వ కార్యాలయాలకు వస్తుంటారు. ఈ ఓటరు ID కార్డ్ ఎన్నికల సమయంలో తగిన నాయకుడిని ఎంచుకోవడానికి వీలు కల్పిస్తుంది. ప్రజాస్వామ్య భారత దేశంలో ప్రతి ఒక్కరు ఓటు హక్కు వినియోగించుకోవాలని చూస్తుంటారు.
ఓటరు గుర్తింపు కార్డును పొందడం సాధారణంగా సులభమే అయినప్పటికీ, అవగాహన లోపం కారణంగా ఈ ప్రక్రియ సవాలుగా అనిపించవచ్చు. నేటి యుగంలో, ఓటరు గుర్తింపు కార్డు కోసం దరఖాస్తు చేసుకోవడం స్మార్ట్‌ఫోన్‌ను ఉపయోగించి ఇంట్లోనే సులభంగా చేసుకోవచ్చు. అందుకే ఓటరు ID కార్డును ఆన్‌లైన్‌లో పొందే సరళమైన పద్ధతి తెలుసుకోవడం మంచిది. ఇది ఈ ప్రక్రియను సులభతరం చేస్తుంది. మీకు ప్రయోజనకరంగా ఉంటుంది.
ఓటరు ID కోసం ఆన్‌లైన్‌లో ఎలా దరఖాస్తు చేయాలి:
ఓటరు గుర్తింపు కార్డు దరఖాస్తు ప్రక్రియను ప్రారంభించడానికి, ఎన్నికల సంఘం వెబ్‌సైట్‌ను సందర్శించాలి. ఆ తర్వాత మీ ఓటరు గుర్తింపు కార్డు నేరుగా మీ ఇంటికి డెలివరీ చేయడం జరుగుతుంది. ఈ ప్రక్రియ పూర్తై మీ ఇంటికి డెలివరీ కావడానికి గరిష్టంగా 10 రోజులు పట్టవచ్చు.
పూర్తి ప్రక్రియ ఇక్కడ చూడండిః
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి…