మహబూబాబాద్ జిల్లాలో ఓ విషాద సంఘటన చోటు చేసుకుంది. ఓ వస్త్ర దుకాణం ఓపెనింగ్ సందర్భంగా వేదిక కుప్పకూలింది. ఆ ఈవెంట్‌కు వచ్చిన హీరోయిన్ ప్రియాంకమోహన్‌కు తృటిలో పెను ప్రమాదం తప్పింది. ఆ కార్యక్రమంలో ఉన్న కల్వకుర్తి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంఛార్జ్ ఝాన్సీ రెడ్డికి తీవ్ర గాయాలు కావడంతో హైదరాబాదులోని ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు.
ఈ ప్రమాదం తొర్రూర్ మండల కేంద్రంలో జరిగింది. కాసం సెలక్షన్స్ నూతన వస్త్ర దుకాణం ప్రారంభోత్సవం సందర్భంగా ప్రమాదం జరిగింది. ఒక్కసారిగా స్టేజి కుప్పకూలిడంతో పలువురికి గాయాలయ్యాయి. ఈ వస్త్ర దుకాణం ప్రారంభోత్సవ వేడుకలో పాలకుర్తి కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ హనుమాండ్ల ఝాన్సీరెడ్డితో పాటు, యంగ్ హీరోయిన్ ప్రియాంక మోహన్ పాల్గొన్నారు. హీరోయిన్‌తో వేదిక పైకి చేరుకొని అభివాదం చేస్తున్న సమయంలో ఒక్కసారిగా స్టేజి కుప్పకూలింది..
ఈ ప్రమాదంలో ఝాన్సీరెడ్డికి తీవ్ర గాయాలయ్యాయి. ఆమెను హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. హీరోయిన్ ప్రియాంకమోహన్ ఏమి కాకపోవడంతో అక్కడ నుంచి ఆమెను తరలించారు. షాపింగ్ మాల్ ముందు ఏర్పాటు చేసిన వేదికపై ఎక్కి ప్రజలకు అభివాదం చేస్తున్న సమయంలో, ఎక్కువమంది వేదికపై ఎక్కడెంతో వేదిక కుప్పకూలినట్లు తెలుస్తుంది.