Inspiration Story: లక్ష్యాన్ని సాధించాలన్న పట్టుదలే ఉంటే ఏదైనా సాధించొచ్చు.. మ్యాటర్ తెలిస్తే హ్యాట్సాఫ్ చెబుతారంతే..!

Inspiration Story: శివలాల్ ఆత్మవిశ్వాసం ముందు వైకల్యం అనేది ఒక చిన్న విషయం.. లక్ష్యాన్ని సాధించాలన్న పట్టుదల ఉంటే ఒక మనిషి ఏదైనా సాధించవచ్చు అదే విశ్వాసంతో

Inspiration Story: లక్ష్యాన్ని సాధించాలన్న పట్టుదలే ఉంటే ఏదైనా సాధించొచ్చు.. మ్యాటర్ తెలిస్తే హ్యాట్సాఫ్ చెబుతారంతే..!
Small Person
Follow us

|

Updated on: Dec 04, 2021 | 6:11 AM

Inspiration Story: శివలాల్ ఆత్మవిశ్వాసం ముందు వైకల్యం అనేది ఒక చిన్న విషయం.. లక్ష్యాన్ని సాధించాలన్న పట్టుదల ఉంటే ఒక మనిషి ఏదైనా సాధించవచ్చు అదే విశ్వాసంతో శివలాల్ ఒక అడుగు ముందుకు వేసి వైకల్యంతో బాధపడే వారికి ఆదర్శంగా నిలిచారు. హైట్ తక్కువ ఉండటం కారణంగా అతను ఎన్నో సమస్యలు ఎదుర్కొన్నారు. కానీ ఒక యూట్యూబ్ వీడియో చూసి.. తన జీవితాన్నే మార్చేసుకున్నాడు. ఆ వీడియోలో తనలాగే వైకల్యం కలిగిన వ్యక్తి కార్ డ్రైవింగ్ చేయడం చూశారు. అది చూసి తానెందుకు అలా చేయకూడదని డిసైడ్ అయ్యారు. వెంటనే యూఎస్ వెళ్లి సంబంధిత వ్యక్తిని కలిసి ఆ టెక్నాలజీ గురించి తెలుసుకున్నారు. ఆయన లాగానే డ్రైవింగ్ చేయాలి అనుకున్నారు. యు.ఎస్ లో ని వ్యక్తి ని కలిసిన తర్వాత అతని జీవితం ఒక మలుపు తిప్పింది.

హైదరాబాద్, ప్రగతి నగర్ లో నివసిస్తున్న శివలాల్ ఒక మరుగుజ్జు. ఒక ప్రైవేట్ కంపెనీలో చార్టెడ్ అకౌంటెంట్ గా పని చేస్తున్నారు. అతని భార్య కూడా మరుగుజ్జీ, వీరికి ఒక కొడుకు. శివలాల్ బయటకు వెళ్ళిన ప్రతిసారి ‘పొట్టివాడు’ అంటూ కొందరు ఎగతాళి చేసేవారు. సమాజంలో కొందరు ఇలాంటి వాళ్ళని ఏదో ఒక వింత జీవి లాగా చూసేవాళ్ళు అంటున్నారు. ఇతని హైట్ కి డ్రైవింగ్ ఎందుకు అని హేళన చేసే వాళ్ళు.. కానీ తాను అవేమి మనసులో పెట్టించుకోకుండా పట్టుదలతో ముందుకు నడుస్తూ ఫోర్ వీలర్ డ్రైవింగ్ లైసెన్స్ సంపాదించి ప్రపంచంలోనే మొదటి మరుగుజ్జు గా నిలిచారు.

యు.ఎస్ లో ఎవరో ఒక వైకల్యం వ్యక్తి కారు నడుపుతున్న వీడియోని చూసి స్ఫూర్తి చెంది, స్వయంగా యుఎస్ కి వెళ్లి అతన్ని కలిశాడు. అతని నుంచి ఆ కారు నడిపే టెక్నాలజీని తెలుసుకుని తిరిగి ఇండియాకి వచ్చి.. గవర్నమెంట్ రూల్స్ ప్రకారం కార్ ను మాడిఫై చేయించుకుని కార్ డ్రైవింగ్ ని నేర్చుకున్నారు. అయితే డ్రైవింగ్ టెస్ట్ అప్పుడు శివలాల్ ని ముందు అధికారులు డ్రైవింగ్ టెస్ట్ కు ఒప్పుకోలేదు. ఒక యువతికి రెండు చేతులు లేకపోయినా డ్రైవింగ్ లైసెన్స్ దక్కించుకుందంటూ ప్రచురితమైన ఆర్టికల్‌ శివలాల్ కంటపడింది. ఇంకేముంది.. ఈ కేస్ ఆధారంగా తీసుకుని శివలాల్ డ్రైవింగ్ చేసి డ్రైవింగ్ లైసెన్స్ పొందిన ప్రపంచంలోనే మొదటి మరుగుజ్జుగా గుర్తింపు పొందారు. తెలంగాణలో ఉన్న సుమారు 400 మంది మరుగుజ్జు లలో డిగ్రీ చేసిన మొట్టమొదటి వ్యక్తి శివలాల్. అంతేకాకుండా మొదటగా డ్రైవింగ్ లైసెన్స్ పొందిన మరుగుజ్జు కూడా ఆయనే కావడం గమనార్హం. అది మాత్రమే కాకుండా తనకు దేశవ్యాప్తంగా ఎన్నో అవార్డులు లభించాయి. భవిష్యత్తులో శివ లాల్ సొంతంగా ఒక డ్రైవింగ్ స్కూల్ ని మొదలు పెట్టి ప్రత్యేకంగా వైకల్యంతో బాధపడే వ్యక్తులకు డ్రైవింగ్ నేర్పిద్దాం అనుకుంటున్నట్లు చెప్పారు.

Also read:

14 బంతుల్లో హాఫ్ సెంచరీ.. 20 నిమిషాల్లో మ్యాచ్ ముగించాడు.. సిక్సర్లు, ఫోర్లతో బౌలర్లకు దబిడి దిబిడే.!

Zodiac Signs: ఈ 6 రాశులవారు తమ తప్పుల నుంచి నేర్చుకుంటారు.! ఏయే రాశులంటే?

IPL 2022: సన్‌రైజర్స్ బిగ్ స్కెచ్.. వార్నర్‌ను రీప్లేస్ చేసేది టీమిండియా టీ20 స్పెషలిస్ట్.. ఎవరో తెలుసా?

Viral Photo: ఈ చిన్నారి ఇప్పుడు కుర్రాళ్ల కలల రాకుమారి.. ఎవరో గుర్తుపట్టండి చూద్దాం!