Telangana: డీజిల్ ట్యాంకర్ బోల్తా.. జనాలు చూడండి ఎలా గుమికూడారో.. సాయం చేసేందుకు కాదు

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దమ్మపేట మండలం ముష్టిబండ గ్రామం వద్ద డీజిల్ ట్యాంకర్ బోల్తా పడింది. ఆ తర్వాత గ్రామస్థులు ఏం చేశారో మీరే చూడండి....

Updated on: Feb 24, 2023 | 11:27 AM

కొత్తగూడెం జిల్లాలో ఓ డీజిల్‌ ట్యాంకర్‌ బోల్తా పడింది. మూల మలుపు కంట్రోల్‌ కాకపోవడంతో వాహనం రోడ్డు కిందకు దిగిపోయింది. ఒక పక్కకు ఒరిగిపోయంది. ట్యాంకర్‌కు బయటకు తీసుకొచ్చే వీలు లేకపోయింది. ఇదే అదనుగా గ్రామస్తులు చెలరేగిపోయారు. క్యాన్లు, బకెట్లు తీసుకొచ్చి డిజీల్‌ తీసుకెళ్లారు. డ్రైవర్‌ ఎంత చెప్పిన వినకుండా గ్రామస్తులు డీజిల్‌ ఎత్తుకెళ్లారు.

అరె.. వాహనం పడిపోయిందే.. సాయం చేద్దామని ఎవరికీ లేదు. తాము ఎత్తుకెళ్లడమే కాదు.. తెలిసినవాళ్లకు ఫోన్ చేసి కూడా సమాచారం ఇచ్చారు. దొరికినకాడికి నింపుకుని వెళ్లారు. ఆ ట్యాంకర్ డ్రైవర్‌ను ఒక్కరు కూడా పట్టించుకున్న పాపాన పోలేదు. చూశారుగా జనాలు ఎట్టా తయారయ్యారో… ఫ్రీగా వస్తే.. ఏదీ వదలరు అండోయ్.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి..

Follow Us