
ధరణి.. ఇకపై భూ భారతిగా మారుతోంది. ధరణి స్థానంలో భూమాతను తెస్తామని గత ఎన్నికల మేనిఫెస్టోలో కాంగ్రెస్ హామీ ఇచ్చింది. ఇందులో భాగంగానే.. భూ సమస్యల నివారణకు తెలంగాణ ప్రభుత్వం నూతన రెవెన్యూ చట్టం తీసుకొచ్చింది. భూ దస్త్రాలు, యాజమాన్య హక్కుల చట్టం-2024 బిల్లును అసెంబ్లీలో ప్రవేశపెట్టారు రెవెన్యూశాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి. ప్రస్తుతం అమల్లో ఉన్న ఆర్‌ఓఆర్-2020 స్థానంలో కొత్తగా భూ భారతి బిల్లుకు తెలంగాణ శాసనసభ ఆమోదం తెలిపింది. 2 కోట్ల 76 లక్షల ఎకరాలు. ఇదీ తెలంగాణ భూభాగం. మరి ఇందులో ప్రభుత్వ భూమి ఎంతో ప్రభుత్వానికి తెలుసా..? కచ్చితంగా తెలీదు..! అటవీ, రెవెన్యూ శాఖల మధ్య ఓ వివాదం ఉంది. చిన్న గొడవ కాదు.. 5 లక్షల ఎకరాలకు సంబంధించింది అది. అంటే.. అటవీశాఖ కింద ఎంత భూమి ఉంది. రెవెన్యూ శాఖ కింద ఎన్ని ఎకరాలు ఉన్నాయో తెలీదన్నట్టేగా? ఆశ్చర్యం ఏంటంటే.. ఓ పదేళ్ల క్రితం భూమి అమ్మేసిన వ్యక్తికి.. సడెన్‌గా అతని పేరు మీదకి ఆ భూమే వచ్చి చేరింది. ఇది మ్యాజిక్ కాదు.. ఒక యదార్థం. భూమి తన పేరు మీదే ఉందనుకుని గుండెలపై చేతులు వేసుకుని హాయిగా నిద్రపోతున్న వ్యక్తికి.. సడెన్‌గా ‘మీ పేరు మీద అసలు భూమే లేదే’ అనే వార్త తెలిసింది. పోనీ ఎవరైనా కబ్జా చేశారా అంటే.. అదేం కాదు. కాని, అతని పేరు మీద భూమి లేదంతే..! ఇలాంటి...