AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Telangana: మురసు ఎఫెక్ట్.. ఇక తెలంగాణలో దంచుడే దంచుడు.. ఈ జిల్లాలకు ఎల్లో అలెర్ట్..

మురసు తుఫాన్ ప్రభావంతో తెలంగాణలో వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. రాష్ట్రంలోని ఎనిమిది జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన తేలికపాటి వర్షాలు కురిసే అవకాశముందని హెచ్చరిస్తూ వాతావరణ శాఖ ఎల్లో అలర్ట్ జారీ చేసింది. గంటకు 40 కి.మీ వేగంతో వీచే ఈదురుగాలులతో వరి కోతల వేళ రైతాంగం తీవ్ర ఆందోళన చెందుతోంది.

Telangana: మురసు ఎఫెక్ట్.. ఇక తెలంగాణలో దంచుడే దంచుడు.. ఈ జిల్లాలకు ఎల్లో అలెర్ట్..
Yellow Alert Issued For 8 Telangana Districts
Krishna S
|

Updated on: Nov 03, 2026 | 4:26 PM

Share

బంగాళాఖాతంలో ఏర్పడిన మురసు తుఫాన్ ప్రభావంతో తెలంగాణలోని పలు ప్రాంతాల్లో వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. రాబోయే 24 నుంచి 48 గంటల్లో రాష్ట్రంలోని ఎనిమిది జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశముందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఈ మేరకు సంబంధిత జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. వాతావరణ శాఖ నివేదిక ప్రకారం.. ప్రధానంగా ఉత్తర, తూర్పు తెలంగాణ జిల్లాలపై ఈ తుఫాన్ ప్రభావం కనిపించనుంది. ముఖ్యంగా ఆదిలాబాద్, నిర్మల్, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం జిల్లాలతో పాటు నిజామాబాద్, మంచిర్యాల, జయశంకర్ భూపాలపల్లి, ములుగు జిల్లాల్లో అక్కడక్కడా తేలికపాటి జల్లుల నుంచి మోస్తరు వర్షం కురిసే సూచనలు కనిపిస్తున్నాయి. వర్షంతో పాటు గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని అధికారులు తెలిపారు.

ప్రస్తుతం ఖరీఫ్ సీజన్ ముగింపు దశకు చేరుకోవడం, పలు జిల్లాల్లో వరి కోతలు, ధాన్యం కొనుగోలు ప్రక్రియలు కొనసాగుతుండటంతో ఈ అకాల వర్ష సూచన రైతాంగాన్ని కలవరపెడుతోంది. ఆకస్మిక ఈదురుగాలులు, తేలికపాటి వర్షాల వల్ల ఆరుబయట ఆరబెట్టిన ధాన్యం, కల్లాల్లోని పంట తడిసిపోయే ప్రమాదం ఉందని అధికారులు హెచ్చరించారు. రైతులు తగిన ముందుజాగ్రత్త చర్యలు చేపట్టి, ధాన్యం రాశులపై టార్పాలిన్లు కప్పి భద్రపరుచుకోవాలని సూచించారు. ఉరుములు, మెరుపుల సమయంలో చెట్ల కింద, పాత భవనాల వద్ద ఉండొద్దని ప్రజలను అప్రమత్తం చేశారు.

అటు ఏపీలో పరిస్థితి ఇలా..

ఏపీలో తుఫాన్ తన ప్రతాపం చూపిస్తుంది. పోలవరం, కాకినాడ, ఎన్టీఆర్, కృష్ణా, బాపట్ల, పల్నాడు జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. మన్యం, తూగో, పగో, కోనసీమ, ఏలూరు జిల్లాల్లో అక్కడక్కడ మోస్తరు వర్షాలు పడతాయని వెల్లడించింది. వర్షాలు ఈదురుగాలులతో ఇప్పటికే పలుచోట్ల చెట్లు విరిగిపడడంతో పాటు పంటలు నీటమునిగాయి. దీంతో అన్నదాతలు ఆందోళన చెందుతున్నారు. మరోవైపు తుఫాన్ అనునిత్యం అప్రమత్తంగా ఉన్నట్లు ఏపీ సర్కార్ తెలిపింది. పంట నష్ట వివరాలను సేకరించి బాధితులకు న్యాయం జరిగేలా చూస్తామని ప్రకటించింది.

Follow Us