Hyderabad: హైదరాబాద్‌లో దారుణం.. చిన్నారిని హత్యాచారం చేసిన ప్రాంతంలోనే మరో బాలికనూ..

|

Jul 10, 2021 | 10:35 AM

Hyderabad: తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌లో శనివారం నాడు రెండు దారుణాలు వెలుగు చూశాయి. శేరిలింగంపల్లి చందానగర్ పిఎస్ పరిధిలో..

Hyderabad: హైదరాబాద్‌లో దారుణం.. చిన్నారిని హత్యాచారం చేసిన ప్రాంతంలోనే మరో బాలికనూ..
Kidnap
Follow us on

Hyderabad: తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌లో శనివారం నాడు రెండు దారుణాలు వెలుగు చూశాయి. శేరిలింగంపల్లి చందానగర్ పిఎస్ పరిధిలో యువకుడిపై గుర్తు తెలియని దుండగలు హత్యాయత్నం చేశారు. శేరిలింగంపల్లి జోన్ కార్యాలయం వద్ద లింకు రోడ్డు ఈ ఘటన చోటు చేసుకుంది. రోడ్డుపై వెళ్తున్న యువకుడిని కొందరు దుండగులు బీరు బాటిళ్లతో గొంతు కోశారు. ఈ ఊహించని పరిణామంతో బాధిత యువకుడు పెద్ద పెట్టున కేకలు వేశాడు. అది విని స్థానికులు రావడంతో.. దుండగులు అక్కడి నుంచి పరారయ్యాడు. దుండగుల దాడిలో తీవ్రంగా గాయపడిన యువకుడిని ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. యువకుడిని పరిశీలించిన వైద్యులు.. అతని పరిస్థితి విషమంగా ఉందని తెలిపారు. కాగా, ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. నిందితుల కోసం గాలిస్తున్నారు. ఘటనా ప్రాంతంలో ఉన్న సిసిటీవీ ఫులేజీలను పరిశీలిస్తున్నారు.

Crime

బాలిక కిడ్నాప్‌కు యత్నించిన దుండగులు..

ఇదిలాఉంటే.. మరో భయానక ఘటన హైదరాబాద్‌ జవహార్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ధమ్మాయిగూడలో వెలుగు చూసింది. నాలుగు రోజుల క్రితం బాలికను హత్యాచారం చేసిన ప్రాంతంలోనే.. దుండగులు మరో చిన్నారిని కిడ్నాప్‌ చేసేందుకు ప్రయత్నించారు. అది గమనించిన కాలనీ వాసులు దుండగులను వెంబడించడంతో బాలికను వదిలేసి పరుగులు తీశారు. ఈ దృశ్యాలన్నీ సీసీ కెమెరాలో రికార్డ్ అయ్యాయి. కాగా, నాలుగు రోజుల క్రితం కూడా దుండగులు ఇదే ప్రాంతంలో ఓ చిన్నారిని అపహరించి హత్యాచారానికి పాల్పడ్డారు. ఈ ఘటన రాష్ట్ర వ్యాప్తంగా పెను సంచలనంగా మారింది. ఇప్పుడు కూడా అదే ప్రాంతంలో కిడ్నాప్‌కు ప్రయత్నం జరగడంతో స్థానికులు తీవ్ర భయాందోళనలో ఉన్నారు. కాగా, ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. సీపీ ఫుటేజీ ఆధారంగా నిందితులను పట్టుకునేందుకు ప్రయత్నిస్తున్నారు.

Also read:

Post Office‌ : పోస్టాఫీస్‌లో మీ డబ్బు ఎన్ని సంవత్సరాలలో డబుల్ అవుతుంది..! ఎంత వడ్డీ చెల్లిస్తారో తెలుసుకోండి..

AP Tenth Results: ఏపీలో పదో తరగతి విద్యార్థుల మార్కుల కేటాయింపుపై కసరత్తు.. ఫార్మెటివ్ మార్కుల ఆధారంగా ..

అమీర్ దంపతుల విడాకులపై బాలీవుడ్ నటుడు షాకింగ్ కామెంట్స్.. ఆమె బోర్ కొట్టిందంటూ..