తెలంగాణలో రెండో దశ కరోనా వ్యాక్సిన్ పంపిణీకి ఏర్పాట్లు.. రేపటి నుంచి పోలీసులకు వ్యాక్సిన్..!

|

Feb 05, 2021 | 10:15 PM

కరోనా వ్యాక్సిన్ రెండో దశలో భాగంగా మున్సిపల్, రెవెన్యూ, పంచాయతీ, పోలీసు శాఖలకు చెందిన ఉద్యోగులు, సిబ్బందికి టీకా వేయడానికి సిద్ధమవుతున్నారు.

తెలంగాణలో రెండో దశ కరోనా వ్యాక్సిన్ పంపిణీకి ఏర్పాట్లు.. రేపటి నుంచి పోలీసులకు వ్యాక్సిన్..!
Follow us on

telangana second phase vaccination : తెలంగాణలో పారిశుద్ధ్య కార్మికులకు, వైద్య సిబ్బందికి కరోనా టీకా వేసే కార్యక్రమం జరుగుతోంది. కరోనా వ్యాక్సిన్ రెండో దశలో భాగంగా మున్సిపల్, రెవెన్యూ, పంచాయతీ, పోలీసు శాఖలకు చెందిన ఉద్యోగులు, సిబ్బందికి టీకా వేయడానికి సిద్ధమవుతున్నారు. శనివారం నుంచి పోలీస్, మున్సిపల్‌ సిబ్బందికి వ్యాక్సిన్ వేస్తామని మంత్రి ఈటల రాజేందర్ ప్రకటించారు.

కేంద్రం సూచనల మేరకు రెండో దశ వ్యాక్సినేషన్ నిర్వహించడానికి తెలంగాణ ప్రభుత్వం కసరత్తు పూర్తి చేసింది. ఫ్రంట్‌ లైన్ వారియర్స్‌కు తగ్గట్టుగా రెండో దశ వ్యాక్సినేషన్‌లో కేంద్ర ప్రభుత్వం వీరికి ప్రాధాన్యతనిస్తోంది. వచ్చే ఆర్థిక సంవత్సరం నుంచి ఆరోగ్యశ్రీతో పాటు ఆయుష్మాన్ భారత్‌ని కూడా తెలంగాణలో అమలు చేస్తామని మంత్రి ఈటల తెలిపారు. నిమ్స్‌లో 500 ఐసీయు పడకలు, వెంటిలేటర్ బెడ్స్, గాంధీలో ఆర్గాన్ ట్రాన్స్‌ప్లాంటేషన్ ఏర్పాటు చేస్తున్నామని మంత్రి చెప్పారు.

. కేంద్రం సూచనల మేరకు రెండో దశ వ్యాక్సినేషన్‌ నిర్వహించడానికి వైద్య ఆ రోగ్య శాఖ కసరత్తులు చేస్తోంది. కరోనా వ్యాక్సిన్‌ రెండో దశలో భాగంగా మున్సిపల్‌, రెవెన్యూ, పంచాయతీ, పోలీసు శాఖలకు చెందిన ఉద్యోగులు, సిబ్బందికి కరోనా వ్యాక్సిన్‌ వేయడానికి సన్నద్ధం అవుతున్నారు. ఫ్రంట్‌లైన్‌ వారియర్స్‌కు తగ్గట్టుగా రెండో దశ వ్యాక్సినేషన్‌లో కేంద్ర ప్రభుత్వం వీరికి ప్రాదాన్యం ఇస్తోంది.

Read Also…  నీటిపారుదల శాఖపై సీఎం కేసీఆర్ సమీక్ష… ఈ ఏడాది రూ.32 వేల కోట్ల అంచనాలతో ఇరిగేషన్ బడ్జెట్‌..!