Corona virus: తెలంగాణలో 24 గంటల వ్యవధిలో కొత్తగా 177 మంది కరోనా బారినపడ్డారు. దీంతో మొత్తం కరోనా కేసుల సంఖ్య 2,95,101కి చేరింది. నిన్న ఒక్కరోజే ఇద్దరు కొవిడ్ కారణంగా మృతి చెందారు. దీంతో మొత్తం మృతుల సంఖ్య 1,606కి పెరిగింది. కాగా… 24 గంటల వ్యవధిలో 198 మంది కరోనా నుంచి కోలుకున్నారు. ఈ మేరకు తెలంగాణ వైద్య ఆరోగ్యమంత్రిత్వ శాఖ గురువారం ఉదయం హెల్త్ బులెటిన్‌ను విడుదల చేసింది.
ఇప్పటి వరకు కరోనా నుంచి కోలుకున్నవారి సంఖ్య 2,91,510కి చేరింది. తెలంగాణ వ్యాప్తంగా ప్రస్తుతం యాక్టివ్ కేసులు 1,985 కాగా, వారిలో 776 హోం ఐసోలేషన్‌లో ఉన్నారు. తెలంగాణ వ్యాప్తంగా ఇప్పటి వరకు నిర్వహించిన కరోనా పరీక్షల సంఖ్య 79,96,651కి చేరింది.
Also Read: