Corona Vaccination: కేంద్రం సూచనల మేరకు వ్యాక్సినేషన్‌.. వ్యాక్సిన్‌పై అనుమానాలు, అపోహాలు వద్దు: మంత్రి ఈటల

|

Jan 15, 2021 | 5:40 PM

Corona Vaccination: కేంద్ర ప్రభుత్వం సూచనల మేరకు మొదటి విడత వ్యాక్సినేషన్‌ కొనసాగుతుందని తెలంగాణ వైద్య ఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్‌ అన్నారు. రేపు రాష్ట్ర..

Corona Vaccination: కేంద్రం సూచనల మేరకు వ్యాక్సినేషన్‌.. వ్యాక్సిన్‌పై అనుమానాలు, అపోహాలు వద్దు: మంత్రి ఈటల
Follow us on

Corona Vaccination: కేంద్ర ప్రభుత్వం సూచనల మేరకు మొదటి విడత వ్యాక్సినేషన్‌ ప్రారంభం అవుతుందని తెలంగాణ వైద్య ఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్‌ అన్నారు. రేపు రాష్ట్ర వ్యాప్తంగా కరోనా వ్యాక్సినేషన్‌ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. శనివారం నుంచి తెలంగాణ రాష్ట్రంలో వ్యాక్సినేషన్‌ ప్రక్రియ జరుగుతుందని అన్నారు. 140 కేంద్రాల్లో వ్యాక్సినేషన్‌ ఉంటుందని, డీసీజీఐ ఆమోదం పొందిన వ్యాక్సిన్‌ మాత్రమే అందిస్తున్నామని పేర్కొన్నారు.

మొదటి విడత ప్రభుత్వ ఆస్పత్రుల్లో పని చేసే వారికి టీకా వేయడం జరుగుతుందని, రెండో విడతలో ప్రైవేటు ఆస్పత్రుల సిబ్బందికి టీకా వేయడం జరుగుతుందన్నారు. వ్యాక్సిన్‌పై అనుమానాలు, అపోహాలు అవసరం లేదని మంత్రి స్పష్టం చేశారు. మొత్తం నెల రోజుల వ్యవధిలో ఒక్కొక్కరికి రెండో డోసులు వేస్తామని, తొలి డోసు కంపెనీ వ్యాక్సినే రెండో డోసుగా తీసుకోవాలన్నారు. అయితే వ్యాక్సినేషన్‌ ప్రక్రియ నిరంతరం కొనసాగుతుందన్నారు. 18 ఏళ్ల లోపు వారు, గర్భిణీలకు వ్యాక్సినేషన్‌ లేదని మంత్రి ఈటల స్పష్టం చేశారు. రేపు ప్రతి కేంద్రంలో 30 మందికి వ్యాక్సినేషన్‌ ఉంటుంది. టీకా తీసుకున్న తర్వాత నొప్పిగా ఉంటే పారాసిటమాల్‌ తీసుకోవాలని అన్నారు.

Also Read: Corona Tests: కరోనా పరీక్షల పేరుతో శంషాబాద్‌ ఎయిర్‌పోర్టులో అడ్డగోలు దోపిడీ.. ప్రయాణికుల నుంచి భారీగా వసూలు