Corona In Telangana: తెలంగాణలో కరోనా విశ్వరూపం.. రోజురోజుకూ పెరుగుతోన్న కేసులు.. ఆ గ్రామంలో లాక్‌డౌన్‌..

|

Apr 04, 2021 | 5:26 PM

Corona In Telangana: తెలంగాణలో కరోనా సెకండ్‌ వేవ్‌ ఉగ్రరూపం దాల్చుతోంది. రోజురోజుకీ పెరుగుతోన్న కేసులు భయాందోళనలకు గురి చేస్తున్నాయి. మొదటి వేవ్‌ కంటే రెట్టింపు వేగంతో కరోనా దూసుకుపోతుంది. ఈ క్రమంలోనే..

Corona In Telangana: తెలంగాణలో కరోనా విశ్వరూపం.. రోజురోజుకూ పెరుగుతోన్న కేసులు.. ఆ గ్రామంలో లాక్‌డౌన్‌..
Follow us on

Corona In Telangana: తెలంగాణలో కరోనా సెకండ్‌ వేవ్‌ ఉగ్రరూపం దాల్చుతోంది. రోజురోజుకీ పెరుగుతోన్న కేసులు భయాందోళనలకు గురి చేస్తున్నాయి. మొదటి వేవ్‌ కంటే రెట్టింపు వేగంతో కరోనా దూసుకుపోతుంది. ఈ క్రమంలోనే తెలంగాణలోని పలు గ్రామాల్లో కరోనా విశ్వరూపం చూపిస్తోంది.

ఆ గ్రామంలో లాక్‌డౌన్‌..

జగిత్యాల జిల్లా మల్లాపూర్ మండలం సిరిపూర్ గ్రామంలో కేసులు పెరుగుతుండడంతో లాక్ డౌన్ విధిస్తూ పంచాయితీ పాలకవర్గం తీర్మానించింది. ఇటీవల గ్రామంలో 27 మందికి కరోనా పాజిటివ్ రావడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు గ్రామస్తులు తెలిపారు.ఈ సందర్భంగా గ్రామంలో ని హోటళ్లు, కటింగ్ షాపులతో పాటు మిగతా దుకాణాలు ఈ నెల 15 వ తేదీ వరకు మూసివేయాలని.. కిరాణా దుకాణాలు ఉదయం 6 నుండి 10 గంటల వరకు, మరలా సాయంత్రం 6 నుండి 9 గంటల వరకు మాత్రమే షాపులు తెరిచి ఉంచాలని నిర్ణయించారు. షాపులకు వచ్చే వారికి మాస్కులు ఉంటేనే వస్తువులు ఇవ్వాలన్నారు. ఎవరైనా నిబంధనలు ఉల్లంగిస్తే రూ.1000 జరిమానా విధించనున్నట్లు తెలిపారు.

నిజామాబాద్‌లో పంజా విసురుతోన్న కరోనా..

నిజామాబాద్‌ జిల్లా సిద్దాపూర్‌లో కరోనా పంజా విసురుతోంది. ఇక్కడ ఏకంగా మొత్తం 86 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. ఈ ఘటన జిల్లా వ్యాప్తంగా తీవ్ర కలకలం రేపుతోంది. ఈ మధ్యనే సిద్దాపూర్‌లో ఓ పెళ్లి వేడుక జరిగింది. ఆ తర్వాత ఆ వేడుకల్లో పాల్గొన్న ఒకరికి కరోనా పాజిటివ్‌ అని తేంది. దీంతో ఒక్క సారిగా ఊరు జనమంతా షాక్‌కు గురయ్యారు. పెళ్లికి వెళ్లిన వారంతా టెస్టింగ్‌ సెంటర్‌కు పరుగులు తీశారు. పరీక్షలు చేసుకున్న వారిలో 86 మందికి కరోనా వచ్చినట్టు తేలింది. దీంతో ఆ గ్రామాన్ని మొత్తం క్వారంటైన్‌గా ప్రకటించారు. వైద్య అధికారులు కూడా అప్రమత్తమయ్యారు.

కరీంనగర్‌ జిల్లాలో..

కరీంనగర్‌ జిల్లాలోని చేగుంట, దుర్శేడు గ్రామాల్లో ఒకేసారి 30 మందికిపైగా కరోనా సోకింది. గత నెలలో చేగుంటలో అనారోగ్యంతో చనిపోయిన ఓ వృద్ధుడి అంత్యక్రియల్లో సుమారు 70 మంది పాల్గొన్నారు. ఆ తర్వాత వారిలో కొందరు అస్వస్థతకు గురయ్యారు. టెస్టులు చేస్తే పాజిటివ్‌ రిపోర్టు వచ్చింది. ఇలా చేగుంటలో 31 మంది కరోనా బారిన పడ్డారు. దుర్శేడు గ్రామం నుంచి కూడా కొంత మంది అంత్యక్రియలకు పాల్గొన్నారు. వారిలో కూడా ఒకరికి సోకింది. అప్రమత్తమైన అధికారులు ఆగమేఘాల మీద శానిటేషన్‌ ప్రక్రియను ముమ్మరం చేశారు. మెడికల్‌ టీమ్స్‌ను పంపించి గ్రామాల్లో ప్రత్యేక చర్యలు చేపట్టారు.

Also Read: Why Fan Have Three Blades: మీ ఇంట్లో ఫ్యాన్ ఉందా..! ఫ్యాన్‌కు మూడు రెక్కలే ఎందుకుంటాయో తెలుసా..!

Easter Etela : లోక కళ్యాణం కోసం ఏసు మళ్లీ వచ్చిన రోజు ఇది.. సనత్ నగర్ బాప్టిస్ట్ చర్చ్ ఈస్టర్ ఉత్సవాల్లో ఈటల రాజేందర్

Yadadri Temple : యాదాద్రిలోవారం రోజుల తర్వాత ఆర్జిత సేవలు పున:ప్రారంభం, దేవాలయంలో పెరిగిన భక్తుల రద్దీ