Telangana Corona Cases Updates: తెలంగాణలో కరోనా వైరస్ ఉధృతి కొనసాగుతోంది. కరోనా వ్యాప్తి కారణంగా రాష్ట్రంలో నమోదువుతున్న కేసుల సంఖ్య విపరీతంగా పెరుగుతోంది. తాజాగా రాష్ట్రంలో భారీ స్థాయిలో కరోనా కేసులు పెరిగాయి. నిన్న.. మొన్న 3 వేలకుపైగా ఉన్న కేసులు.. ఇవాళ 4 వేల మార్క్‌ను దాటాయి. గడిచిన 24 గంటల్లో రాష్ట్ర వ్యాప్తంగా కొత్తగా 4,446 కరోనా పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. తాజాగా నమోదైన కేసులతో కలిపి ఇప్పటి వరకు రాష్ట్రంలో 3,46,331 మంది కరోనా బారిన పడ్డారు. ఇదే సమయంలో రికవరీల సంఖ్య గణనీయంగా తగ్గుతోంది. తాజాగా 1,414 మంది కరోనా నుంచి కోలుకున్నారు. మొత్తంగా చూసుకుంటే ఇప్పటి వరకు రాష్ట్ర వ్యాప్తంగా 3,11,008 మంది బాధితులు కరోనాను జయించారు. మరో ఆందోళనకర విషయం ఏంటంటే.. కరోనా కారణంగా చనిపోయే వారి సంఖ్య క్రమంగా పెరుగుతూ వస్తోంది.
ఇవాళ ఏకంగా 12 మంది కరోనా బాధితులు తమ ప్రాణాలు కోల్పోయారు. వీరితో కలిపి ఇప్పటి వరకు రాష్ట్రంలో 1809 మంది కరోనా కారణంగా చనిపోయారు. ప్రస్తుతం రాష్ట్రంలో 33,514 యాక్టీవ్ కేసులు ఉన్నాయి. వీరిలో 22,118 మంది హోం ఐసోలేషన్‌లో చికిత్స పొందుతున్నారు. మొత్తంగా రాష్ట్రంలో రికవరీ రేటు 89.8 శాతానికి పడిపోగా.. మరణాల రేటు 0.52 శాతంగా ఉంది. ఇదిలాఉంటే.. గడిచిన 24 గంటల్లో నమోదైన కేసుల్లో అత్యధికంగా 598 కేసులు నమోదు అయ్యాయి. ఆ తరువాత మేడ్చల్ మల్కాజిగిరి-435, రంగారెడ్డి-326, నిజామాబాద్-314, సంగారెడ్డి-235, వరంగల్ అర్బన్-136, సిద్ధిపేట-111, నిర్మల్-160, నల్లగొండ-168, మంచిర్యాల-121, మహబూబ్‌నగర్-139, ఖమ్మం-148, కరీంనగర్-149, కామారెడ్డి-184, జగిత్యాల-180 చొప్పున అత్యధికంగా ఈ జిల్లాల్లో కరోనా కేసులు నమోదు అయ్యాయి.
Telangana Corona Bulletin:
Also read:
Mahabubabad News: ఇలా కట్టారు.. అలా కుప్పకూలిపోయింది.. మహబూబాబాద్‌లో దారుణం.. గ్రామస్తుల ఆగ్రహం..