
సడెన్‌గా పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్ట్‌ను ఫోకస్ చేయడంతో.. కేసీఆర్ మరో సెంటిమెంట్ అస్త్రాన్ని సంధించారనే అనుకున్నారంతా. కృష్ణాలో నీళ్లు, వాటాలు.. పాలమూరు ప్రాజెక్టులో పనులు.. ఎవరెంత చేశారనే వాదనలు.. ఇవే జరుగుతూ వచ్చాయి నిన్నటి దాకా. బట్.. ఉన్నట్టుండి స్టోరీ లైన్ ఈ ట్విస్ట్ తీసుకుంటుందని ఊహించలేదెవరూ. ఎంతైనా ‘నీటి’ అంశానికి భావోగ్వేదం ఎక్కువ కదా.. ఇరుపక్షాల వాళ్లు వాదోపవాదనలు, వాగ్వివాదాలు చేసుకుంటారనుకున్నారు. కాని ఈ కథ.. ఊహించని మలుపులతో నడుస్తోందిప్పుడు. అసలు గొడవంతా ఎక్కడ జరుగుతోంది. పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్ట్‌ను 90 శాతం పూర్తి చేసి అప్పగిస్తే.. ఈ రెండేళ్లలో తట్టెడు మట్టి కూడా తీయలేదు అనేది మాజీ సీఎం కేసీఆర్ చేసిన ప్రధాన ఆరోపణ. అక్కడ మొదలైంది ఈ గొడవంతా. రెండు కిలోమీటర్ల కాలువను కూడా తవ్వలేకపోయిందని మాట్లాడుతోంది బీఆర్ఎస్. బట్.. కాంగ్రెస్ ప్రభుత్వం ఏమంటోంది..! పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్ట్ విషయంలో వచ్చే వందేళ్లలో కూడా సరిదిద్దలేనంత తప్పు, అన్యాయం జరిగిందంటోంది. స్ట్రెయిట్ పాయింట్ ఏంటంటే.. పాలమూరు-రంగారెడ్డి లిఫ్ట్ ఇరిగేషన్-PRLI ప్రాజెక్ట్ కట్టాలంటే ముందు వాటర్ సోర్స్ ఉండాలిగా. అంటే.. ఎక్కడో ఒక దగ్గర నుంచి నీటిని ఎత్తిపోయాలిగా. ముందుగా అనుకున్న ప్లాన్ ప్రకారం.. జూరాల నుంచి కృష్ణా నది నీటిని ఎత్తిపోసి ఉమ్మడి మహబూబ్‌నగర్, రంగారెడ్డి, నల్లగొండ జిల్లాలకు నీరు పారించాలి అనుకున్నారు. అంటే.. పాలమూరు ప్రాజెక్టుకు సోర్స్ పాయింట్ జూరాల ప్రాజెక్ట్. ముందుగా అనుకున్నది అదే. కాని, తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక.. బీఆర్ఎస్ అధికారంలోకి...