Telangana: అక్కడ కలువకుండా కేసీఆర్‌ను కలిస్తే అనుమానాలు వచ్చేవి.. కాంగ్రెస్ నేత వి.హన్మంతరావు కామెంట్స్

|

Apr 25, 2022 | 1:41 PM

Telangana: తెలంగాణలో కాంగ్రెస్ కు కచ్చితంగా పూర్వవైభవం వస్తుందని ఆ పార్టీ నేత వి.హన్మంతరావు స్పష్టం చేశారు. ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ వ్యవహారాన్ని పార్టీ అధిష్టానం చూసుకుంటుందని అన్నారు..

Telangana: అక్కడ కలువకుండా కేసీఆర్‌ను కలిస్తే అనుమానాలు వచ్చేవి.. కాంగ్రెస్ నేత వి.హన్మంతరావు కామెంట్స్
Follow us on

Telangana: తెలంగాణలో కాంగ్రెస్ కు కచ్చితంగా పూర్వవైభవం వస్తుందని ఆ పార్టీ నేత వి.హన్మంతరావు స్పష్టం చేశారు. ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ వ్యవహారాన్ని పార్టీ అధిష్టానం చూసుకుంటుందని అన్నారు. ఆయన తెలంగాణ సీఎం కేసీఆర్ (KCR)ను కలవకముందే ఢిల్లీ (Delhi)లో కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీని కలిశారని.. రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ తో చర్చలు జరిపారని వెల్లడించారు. ప్రశాంత్ కిశోర్ వారితో కలవకుండా నేరుగా కేసీఆర్‌తో కలిస్తే అనుమానాలు వచ్చేవని వ్యాఖ్యానించారు. పీకే ఏ వ్యూహంతో కేసీఆర్ ను కలిశారో తెలియదన్న హన్మంతరావు.. మాణిక్యం ఠాకూర్ ట్విట్ పై తాను కామెంట్స్ చేయనని పేర్కొన్నారు. ఆయన ఏ ఉద్దేశ్యంతో చేసినా అందులో ఏదో ఒక బలమైన కారణం ఉంటుందని చెప్పారు. తెలంగాణలో కాంగ్రెస్ బలంగా ఉందని, ఎవరితోనూ పొత్తులు పెట్టుకోవాల్సిన అవసరం లేదని అభిప్రాయం వ్యక్తం చేశారు. పార్టీ నిర్ణయం మేరకు అందరం కలిసి పని చేస్తామని వివరించారు.

ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్‌ కిశోర్‌ (PK) ఇటీవల ఏఐసీసీ నేతలతో వరుసగా చర్చలు నిర్వహించారు. సోనియా గాంధీతో వరుసగా సమావేశమవుతూనే.. మరోవైపు టీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌తో భేటీ కావడం తెలంగాణ కాంగ్రెస్‌లో అయోమయ పరిస్థితికి దారితీసింది. ఇటు కాంగ్రెస్‌తో జట్టు కడుతూనే.. సీఎం కేసీఆర్‌తో రాజకీయ ఒప్పందం కుదుర్చుకోవడం ప్రస్తుతం టీపీసీసీ నేతలను ఇరకాటంలో పడేసినట్లు రాజకీయ వర్గాలు పేర్కొంటున్నాయి. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో పీకే టీఆర్ఎస్ కోసం పనిచేస్తే.. అది కాంగ్రెస్‌పై ప్రభావం చూపుతుందని ఆందోళన చెందుతున్నట్లు తెలుస్తోంది. రాష్ట్రంలో ప్రతిపక్షంగా ఉన్న కాంగ్రెస్‌ పార్టీ వచ్చే ఎన్నికలపై ప్రత్యేకంగా దృష్టి సారించింది. ఇప్పటికే ఏఐసీసీ అగ్రనేత రాహుల్‌గాంధీతో రాష్ట్ర నేతలు సమావేశమయ్యారు. దీంతోపాటు వచ్చే నెల 6, 7 తేదీల్లో రాహుల్‌ రాష్ట్రంలో పర్యటించనున్నారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

ఇవి కూడా చదవండి :

CM KCR: ఘనంగా ప్రారంభమైన మహా కుంభాభిషేక మహోత్సవాలు.. సీఎం కేసీఆర్ ప్రత్యేక పూజలు..

Hyderabad: స్పా ముసుగులో అసాంఘిక కార్యకలాపాలు.. ఇద్దరు యువతులు, నిర్వాహకుడు అరెస్టు