Sharmila vs Jaggareddy: నా జోలికొస్తే చాలా అనాల్సి ఉంటుంది.. షర్మిల వ్యాఖ్యలకు జగ్గారెడ్డి స్ట్రాంగ్ కౌంటర్..

|

Sep 27, 2022 | 1:56 PM

Sharmila vs Jaggareddy: షర్మిల వర్సెస్‌ జగ్గారెడ్డి ఎపిసోడ్‌... పీక్స్‌కు చేరింది. ఇద్దరి మధ్యా ముదిరిన మాటల యుద్ధం అంతకంతకూ ముదురుతోంది.

Sharmila vs Jaggareddy: నా జోలికొస్తే చాలా అనాల్సి ఉంటుంది.. షర్మిల వ్యాఖ్యలకు జగ్గారెడ్డి స్ట్రాంగ్ కౌంటర్..
Mla Jaggareddy
Follow us on

Sharmila vs Jaggareddy: షర్మిల వర్సెస్‌ జగ్గారెడ్డి ఎపిసోడ్‌… పీక్స్‌కు చేరింది. ఇద్దరి మధ్యా ముదిరిన మాటల యుద్ధం అంతకంతకూ ముదురుతోంది. నువ్వొకటంటే నేను రెండంటా.. అన్నట్టు మాటల తూటాలు పేల్చుకుంటున్నారు ఇద్దరు నేతలు. తాజాగా రాజకీయ వ్యభిచారి అంటూ… తనపై షర్మిల చేసిన కామెంట్స్‌కు స్ట్రాంగ్‌ కౌంటర్‌ ఇచ్చారు జగ్గారు. నిన్నటి దాకా షర్మిల ఏం మాట్లాడినా.. కాస్త కూల్‌గానే రిప్లయ్‌ ఇచ్చిన జగ్గన్న ఇవాళ బరస్టయ్యారు. ఒళ్లు దగ్గరపెట్టుకో అంటూ స్ట్రాంగ్‌ వార్నింగే ఇచ్చారు.

జగ్గారెడ్డి కామెంట్స్ ఆయన మాటల్లోనే.. ‘ఒళ్లు దగ్గర పెట్టుకో షర్మిల. కంట్రోల్‌లో ఉండు, ఇది నా వార్నింగ్‌. మళ్లీ రిపీట్‌ అయితే ఊరుకోను. నేను కూడా చాలా విషయాలు మాట్లాడతా. రాజకీయ వ్యభిచారి అని నన్ను విమర్శిస్తావా? నేను నిన్ను అలా అంటే ఎలా ఉంటుంది? హద్దు మీరి మాట్లాడొద్దు, తమాషాలా. షర్మిలా… నీకు బుద్ధి ఉందా? మగాళ్లతో ఎలా మాట్లాడాలో నీకు తెలియదా? ఇష్టానుసారం మాట్లాడితే వేరేలా ఉంటది. నా జోలికొస్తే చాలా అనాల్సి ఉంటుంది. రాజశేఖర్ రెడ్డి కూతురు అని మాత్రమే చూస్తున్నా.. అంతకు మించి ఎం లేదు. ఆయనకున్న గుణాలు షర్మిలకు లేవు. చిల్లర మాటలు వద్దు.. హుందాగా మాట్లాడాలి. రాజశేఖరరెడ్డి పరువు తియొద్దు. మహిళ కాబట్టి నేను ఎం అనలేకపోతున్న. లిమిట్స్ దాటి మాట్లాడొద్దు. నన్ను వ్యభిచారి అంటున్నావ్ నేను తిరిగి అంటే బాగుండదు. అందారిలాగా కాదు జగ్గా రెడ్డి. సంస్కారం లేదా? మొగవాళ్ళతో ఎలా మాట్లాడాలో నేర్చుకో. ఫైనల్ వార్నిగ్ ఇస్తున్న. ఇంకో సారి నోరు జారితే ఇతర విషయాలు మాట్లాడలి వొస్తుంది.’ అని జగ్గారెడ్డి తనదైన శైలిలో షర్మిలపై శివాలెత్తారు.

ఇదిలాఉంటే.. రెండు మూడు రోజులుగా షర్మిల, జగ్గారెడ్డిల మధ్య పరస్పర ఆరోపణలు, విమర్శల పరంపర తెలంగాణలో పొలిటికల్‌గా పొగరేపుతోంది. మొన్నటి దాకా మంత్రి నిరంజన్‌రెడ్డిని టార్గెట్‌ చేసిన షర్మిల.. ఇప్పుడు అనూహ్యంగా ప్రతిపక్ష ఎమ్మెల్యే జగ్గారెడ్డిని టార్గెట్‌ చేశారు. దీంతో, ఇద్దరు నేతల మధ్య మాటల యుద్ధం మొదలైంది. సంగారెడ్డిలోకి ప్రజాప్రస్థానం పాదయాత్ర ఎంటరైంది మొదలు.. స్థానిక ఎమ్మెల్యే జగ్గారెడ్డిపై ఓ రేంజ్‌లో ఫైరవుతున్నారు షర్మిల. వరుస కామెంట్లతో అలజడి సృష్టించారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..