Vemulawada Rajanna: వేముల‌వాడ రాజన్న సన్నిధిలో అద్భుతం.. అనుకోని అతిధి ఎంట్రీ.. ఆ తరువాత ఏం జరిగిందంటే..

|

Apr 26, 2022 | 4:41 PM

Vemulawada Rajanna: వేములవాడ రాజన్న సన్నిధిలో నాగుపాము హడావుడి చేసింది. దాదాపు అరగంట పాటు అటూ ఇటూ తిరుగుతూ హల్ చల్ చేసింది.

Vemulawada Rajanna: వేముల‌వాడ రాజన్న సన్నిధిలో అద్భుతం.. అనుకోని అతిధి ఎంట్రీ.. ఆ తరువాత ఏం జరిగిందంటే..
Vemulawada Temple
Follow us on

Vemulawada Rajanna: వేములవాడ రాజన్న సన్నిధిలో నాగుపాము హడావుడి చేసింది. దాదాపు అరగంట పాటు అటూ ఇటూ తిరుగుతూ హల్ చల్ చేసింది. రాజరాజఏశ్వర స్వామి దేవాలయ రాజగోపురం ముందు మార్గం నుంచి ఎంటరైన నాగుపాము.. చాలాసేపు అక్కడే తచ్చాడింది. నాగుపామును చూసిన భక్తులు భయాందోళనతో పరుగులు తీశారు. విషయాన్ని ఆలయ అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. వెంటనే అలర్ట్ అయిన అధికారులు పామును పట్టుకునేందుకు ప్రయత్నించారు. కాగా, దేవస్థానంలో పని చేస్తున్న అవుట్ సోర్సింగ్ ఉద్యోగి లక్ష్మణ్ ఆ నాగుపామును పట్టుకున్ని బందించాడు. ఆ తరువాత వేములవాడ పట్టణ శివారులోని అటవీ ప్రాంతంలో పామును వదిలేశారు. పాము ఎవరికీ ఎలాంటి హానీ తలపెట్టకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. ఇదిలాఉంటే.. పామును చూసి కొందరు భయపడిపోతే.. మరికొందరు మాత్రం భక్తిపారవశ్యంతో దానిని పూజించారు. పామును దూరంగా చూస్తూ దండం పెట్టుకున్నారు. పరమేశ్వరుడిని దర్శించుకోవడానికే నాగుపాము వచ్చిందని భావిస్తున్నారు. కాగా, దీనికి సంబంధించిన వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా అది వైరల్ గా మారింది.

Also read:

Viral Video: ఇంత క్యూట్‌‌గా మరెవరూ పాడరేమో.. అటు డాగీ, ఇటు బేబీ దుమ్ము రేపారు.. బ్యూటీఫుల్ వీడియో మీకోసం..

Traffic Challan: ఇదెక్కడి ఇచ్చంత్రం సామీ.. చలాన్లు ఇలా కూడా వేస్తారా?.. తలపట్టుకున్న వాహనదారుడు..!

Health Care Tips: ధూమపాన వ్యసనంతో ఇబ్బంది పడుతున్నారా.. ఈ ఆయుర్వేద చిట్కాలతో చెక్ చెప్పండి..!