మంత్రి కొండా సురేఖ వ్యవహారంపై స్పందించిన సీఎం రేవంత్ రెడ్డి.. ఏమన్నారో తెలుసా..?

తెలంగాణ కాంగ్రెస్‌లో మంత్రి కొండా సురేఖ వ్యవహారం కీలక దశకు చేరుకున్న నేపథ్యంలో సీఎం రేవంత్‌రెడ్డి స్పందించారు. కొండా సురేఖ అంశాన్ని క్రమశిక్షణ కమిటీతో పాటు ఏఐసీసీ చూసుకుంటుందని స్పష్టం చేశారు. మరోవైపు క్రమశిక్షణ కమిటీ నివేదిక సిద్ధం కావడం, టీపీసీసీ నేతలు హైకమాండ్ నిర్ణయం తీసుకుంటుందని చెప్పడంతో సురేఖపై ఎలాంటి చర్యలు ఉంటాయన్నది తెలంగాణ కాంగ్రెస్‌లో హాట్‌టాపిక్‌గా మారింది.

మంత్రి కొండా సురేఖ వ్యవహారంపై స్పందించిన సీఎం రేవంత్ రెడ్డి.. ఏమన్నారో తెలుసా..?
Revanth Reddy

Updated on: Aug 24, 2026 | 8:50 PM

తెలంగాణ కాంగ్రెస్‌లో మంత్రి కొండా సురేఖ అంశం క్లైమాక్స్‌కు చేరిందా? పార్టీలో అలజడి రేపిన విషయంపై.. నిర్ణయం తీసుకునే దిశగా పార్టీ అడుగులు వేస్తోందా? అంటే, అవుననే అంటున్నాయి.. కాంగ్రెస్ వర్గాలు. ఇటు సీఎంతో నేతల మంతనాలు.. అటు క్రమశిక్షణ కమిటీ రిపోర్టులు, హాట్ టాపిక్‌గా మారాయి. తెలంగాణ కాంగ్రెస్‌లో కొండా సురేఖ వ్యవహారంపై ఎలా ముందుకు వెళ్లాలనే దానిపై హస్తం పార్టీ ఆచితూచి అడుగులు వేస్తున్నట్లు తెలుస్తోంది.. ఈ క్రమంలోనే.. విదేశీ పర్యటన నుంచి వచ్చిన ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి.. వారం రోజులుగా ఇటు పార్టీలో అటు ప్రభుత్వంలో జరిగిన పరిణామాలపై ఆరా తీశారు. సీఎం రేవంత్‌ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ప్రత్యేకంగా సమావేశమై.. పలు అంశాలపై చర్చించారు. కొండా సురేఖ అంశాన్ని క్రమశిక్షణ కమిటీతో పాటు ఏఐసీసీ చూసుకుంటుందని సీఎం రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. కొండా సురేఖ అంశంపై ఇక ఎవరూ మాట్లాడొద్దని సీఎం సూచించారు.

అందుబాటులోని మంత్రులు, ఎమ్మెల్యేలతో భేటీ అయిన సీఎం రేవంత్ రెడ్డి.. సురేఖ విషయంలో హైకమాండ్‌ నిర్ణయమే ఫైనల్‌ అనీ… ఊహాజనిత కథనాలు వద్దు అనీ… స్పష్టత ఇచ్చారు. కాగా.. సురేఖపై చర్యలకు ఎమ్మెల్యేలు, పలువురు నేతలు పట్టుబడుతున్న నేపథ్యంలో సీఎం రేవంత్ ఫుల్ క్లారిటీ ఇచ్చారు.

బహిరంగంగా మాట్లాడేది లేదన్న మంత్రి కోమటిరెడ్డి

కొండా సురేఖ అంశంతో పాటు పార్టీకి సంబంధించిన అంతర్గత విషయం ఏదైనా.. తగిన వేదికలోనే మాట్లాడుతామే తప్ప.. బహిరంగంగా మాట్లాడబోమని అన్నారు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి.

రిపోర్ట్ ఇవ్వడం వరకే నా బాధ్యత

ఈ విషయంలో అందరి అభిప్రాయాల మేరకు నివేదిక సిద్ధం చేశామని అంటున్నారు పార్టీ క్రమశిక్షణ కమిటీ చైర్మన్ మల్లు రవి. రిపోర్ట్ ఇవ్వడం వరకే తన బాధ్యత అని పేర్కొన్నారు.

హైకమాండ్ నిర్ణయం తీసుకుంటుంది: మహేష్‌గౌడ్

కొండా వివాదంపై ప్రాథమిక నివేదిక ఇప్పటికే AICC, PCCకి అందిందన్నారు టీపీసీసీ చీఫ్ మహేష్‌గౌడ్. పూర్తి నివేదిక వచ్చాక హైకమాండ్ నిర్ణయం తీసుకుంటుందన్నారు. హద్దులు దాటితే ఎంత వారి మీదైనా చర్యలు తప్పవన్నారు.

వనమహోత్సవం ఏర్పాట్లపై మంత్రి సురేఖ సమీక్ష..

ఇదిలా ఉంటే వారం రోజుల తర్వాత మంత్రి కొండా సురేఖ అధికారిక సమీక్షలో పాల్గొన్నారు. తన నివాసం నుంచే జూమ్‌ ద్వారా కలెక్టర్లు, డీఎఫ్‌వోలతో సమావేశమయ్యారు. మంగళవారంనాడు రాష్ట్రవ్యాప్తంగా నిర్వహించనున్న ప్రత్యేక వనమహోత్సవం ఏర్పాట్లపై జిల్లాల వారీగా సమీక్ష నిర్వహించి.. అధికారులకు పలు సూచనలు చేశారు. వారం రోజులుగా అధికారులకు అందుబాటులో లేని కొండా సురేఖ ఇవాళ సమీక్ష నిర్వహించడం, మరోవైపు క్రమశిక్షణ కమిటీ నివేదిక సిద్ధం కావడం, సీఎం రేవంత్‌తో డిప్యూటీ సీఎం భట్టి భేటీ కావడం కాంగ్రెస్‌ వర్గాల్లో ఆసక్తి నెలకొంది. సురేఖపై పార్టీ ఎలాంటి నిర్ణయం తీసుకోబోతోంది..? క్రమశిక్షణ కమిటీ నివేదికలో ఏముంది..? సీఎం రేవంత్‌ నిర్ణయం ఎలా ఉండబోతోంది..? అన్నది ఇప్పుడు హాట్‌టాపిక్‌గా మారింది.

కొండా సురేఖ మాజీ ఓఎస్డీ కేసులో మరో ముగ్గురు అరెస్ట్

మరోవైపు.. కొండా సురేఖ మాజీ ఓఎస్డీ కేసులో మరో ముగ్గురు అరెస్టయ్యారు. అరుణ్‌కుమార్‌, మహేందర్‌రెడ్డి, కార్తీక్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మార్టూరులో అరెస్ట్ చేసిన ఖైరతాబాద్‌ టాస్క్‌ఫోర్స్ పోలీసులు.. జూబ్లీహిల్స్ పోలీసులకు అప్పగించారు. దీంతో కొండా సురేఖ మాజీ OSD సుమంత్ కేసులో ఇప్పటి వరకు నలుగురు అరెస్ట్ అయినట్టైంది.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Loading...
Unable to load recommendations.
Follow Us